Most Expensive School:ఈరోజుల్లో చదువు ఖరీదుగా మారిపోతుంది.. ఏడాదికి ఏడాది స్కూల్ ఫీజులు పెరిగిపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే తమకు ఎంత కష్టం వచ్చినా ఖరీదైన స్కూళ్లలో చదువుపించాలని కొందరు తల్లిదండ్రులు ఆరాటపడుతూ ఉంటారు. ఆయా స్కూళ్లలో చదివితే జీవితంలో స్థిరపడతారని భావిస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు సైతం నేటి కాలంలో ఐఐటి ర్యాంకులు కొడుతున్నారు. చదువు అనేది విద్యార్థి జ్ఞానంపై ఆధారపడి ఉంటుందని కొందరు ఉపాధ్యాయులు చెబుతూ ఉంటారు. అయినా లక్షల రూపాయలు పోసి తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చదివిస్తూ ఉంటారు. అయితే లక్షలు కాదు.. కోట్ల రూపాయలు వెచ్చించి చదివించేవారు కూడా ఉన్నారు.. మరి అలా కోట్ల రూపాయల ఫీజు తీసుకునే స్కూల్ ఎక్కడ ఉందో తెలుసా?
Also Read: జాగ్రత్త..! ఇన్ స్టాగ్రామ్ లో ఇక అలాంటి పోస్టులు పెడితే జైలుకే..
స్విట్జర్లాండ్ దేశంలోని Institute Le Rosi అనే పాఠశాల ప్రపంచంలోని అత్యంత ధనికమైనదిగా గుర్తింపు పొందింది. ఈ పాఠశాలలో చదవాలంటే కోట్ల రూపాయలు హెచ్చించాల్సిందే. ఈ పాఠశాలను 1880లో పాల్ ఏమిలే కార్నిల్ స్థాపించాడు. ఈ పాఠశాల పైనుంచి చూస్తే రిసార్ట్ లాగా కనిపిస్తుంది. చుట్టూ పచ్చని వాతావరణం విద్యార్థులకు ఆహ్లాదాన్ని ఇచ్చే భవనాలు, కచేరి హాల్ వంటివి ఉన్నాయి. అలాగే షూటింగ్ రేంజ్ లు, ప్లేయింగ్ కోసం టెన్నిస్ కోర్టులో వంటివి ఉన్నాయి.
ఈ పాఠశాలలో ప్రతి ఏడాది 500 మంది మాత్రమే అడ్మిషన్ పొందేందుకు అవకాశం ఉంది. వీరు కూడా అత్యంత ధనవంతుల పిల్లలు మాత్రమే ఉంటారు. రాజుల కుమారులు, చక్రవర్తుల కుటుంబానికి చెందినవారు మాత్రమే ఇక్కడ చదువుతుంటారు. అందుకే దీనిని ‘స్కూల్ ఆఫ్ కింగ్స్’ అని అంటారు. ఇక్కడ ఒక్కో విద్యార్థి ఫీజు 1 కోటి11 లక్షల వరకు ఫీజు ఉంటుంది. ఇక్కడ ఇప్పటివరకు స్పెయిన్, ఈజిప్టు దేశాలకు చెందిన రాజుల కుమారులు చదువుకున్నారు. ఈ పాఠశాలలో ప్రతి దేశం నుంచి 10 శాతం మాత్రమే అడ్మిషన్ పొందేందుకు అవకాశం ఉంటుంది. వీరు ఈ పాఠశాలలో చేరాలంటే విద్యార్థి చదువు మాత్రమే కాకుండా వారి బ్యాక్ గ్రౌండ్ బాగుండాలి. అంటే ధనవంతుల పిల్లలు అయి ఉండాలి.
Also Read: మనుషుల్లో మానవత్వం ఇంకా ఉంది.. అందుకు నిదర్శనమే ఇది..
ఈ స్కూల్లో కేవలం చదువు మాత్రమే కాకుండా మిగతా రంగాల్లో కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. అంటే షూటింగ్, ఆర్ట్స్, మ్యూజిక్ ఇలా ఎవరికి ఏది ఇష్టమో అందులో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తూ ఉంటారు. 200 మంది ఉపాధ్యాయులు ఇందులో పని చేస్తారు. వీరి పిల్లలు కూడా ఈ పాఠశాలలో చదువుకోవచ్చు. వారికి 30 సీట్లు కేటాయిస్తారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 50 దేశాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలకు ప్రస్తుతం కిమ్ కోవా సేవిచ్ ప్రధానోపాధ్యాయుడిగా వ్యవహరిస్తున్నాడు. చాలామంది ధనవంతుల పిల్లలను ఇక్కడే చదివిస్తూ ఉంటారు. ఇక్కడ తమ కుమారులను చదివించడం వల్ల భవిష్యత్తు బాగుంటుందని భావిస్తుంటారు. అయితే వీరు తమ విద్యతో తల్లిదండ్రులకు పేరు తీసుకొచ్చే విధంగా జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను నేర్చుకుంటారు.