Bigg Boss 9 Telugu: నిన్న గాక మొన్న మొదలైనట్టు అనిపిస్తున్న బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) అప్పుడే 10 వారాలు పూర్తి చేసుకోబోతోంది. ఈ సీజన్ టీఆర్ఫీ రేటింగ్స్ పరంగా చూస్తే పెద్ద హిట్. కానీ టాస్కులు ఆశించిన స్థాయిలో పెట్టడం లేదు. టాస్కులు కంటే ఎక్కువగా ఈ సీజన్ బంధాలు, ఎమోషన్స్ మీదనే నడుస్తూ ముందుకు పోతోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ సీజన్ లో టైటిల్ రేస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఇద్దరే. ఒకరు తనూజ, మరొకరు పవన్ కళ్యాణ్. తనూజ కి ఇతనికి మధ్య ఓటింగ్ తేడా చాలానే ఉంది. అయితే ఈ వారం కాస్త పవన్ కళ్యాణ్ ఓటింగ్ పెరిగింది. నిన్నటి ఎపిసోడ్ అతనికి బాగా పాజిటివ్ కూడా అయ్యింది. ఇదంతా పక్కన పెడితే వచ్చే వారం ఫ్యామిలీ వీక్ నడవబోతున్న సంగతి తెలిసిందే. హౌస్ మేట్స్ అందరూ ఈ వారం లో ఫ్యామిలీ వీక్ ఉంటుందని అనుకున్నారు కానీ, వచ్చే వారం అని తర్వాత అందరికీ తెలిసింది.
Also Read: అమ్మాయిని కౌగిలించుకొని మరో వివాదం లో ఇరుకున్న ‘గర్ల్ ఫ్రెండ్’ మూవీ డైరెక్టర్….
హౌస్ మేట్స్ అందరూ తమ కుటుంబ సభ్యుల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. మా ఫ్యామిలీ వచ్చి వెళ్తే నాకు టార్చర్, అసలు వాళ్ళు రాకుంటేనే మంచిది అంటూ మొన్న దివ్య తో మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. తన తల్లిదండ్రులు రావాలని, వాళ్ళతో మాట్లాడాలని కళ్యాణ్ అసలు అనుకోవడం లేదు. ఇదంతా చూసిన కళ్యాణ్ అభిమానులు, అసలు అతనికి ఏమైంది?, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు?, తన తల్లిదండ్రులతో ఏమైనా ఇతనికి గొడవలు జరిగాయా?, చాలా సంవత్సరాల నుండి మాట్లాడుకోవడం లేదా?, అసలు నేషనల్ టీవీ ఛానల్ లో ఎవరైనా ఇలా మాట్లాడుతారా?, కచ్చితంగా ఎదో పెద్ద మ్యాటర్ జరిగింది అని అంటున్నారు.
ఇక కళ్యాణ్ మాట్లాడిన మాటలను ఆయన తల్లిదండ్రులు చూసి చాలా బాధపడ్డారట. మేము మా బిడ్డ ఎలా ఉన్నాడో అక్కడ అని టెన్షన్ పడుతూ ఉంటే, కళ్యాణ్ మాత్రం మమ్మల్ని చూడాలని అనుకోవడం లేదని బాధపడుతున్నారట. దీంతో ఫ్యామిలీ వీక్ లో కళ్యాణ్ కుటుంబం వస్తుందా లేదా అనే సందేహం ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ లో కలుగుతోంది. ఇదంతా పక్కన పెడితే రాము కూడా గతం లో ఇలాగే మాట్లాడేవాడు. ఫ్యామిలీ వీక్ లో మా అమ్మ కానీ, నాన్న కానీ వస్తే, వాళ్ళని చూసి నేను ఆగలేను, వాళ్ళతో పాటు వెళ్ళిపోతాను, అందుకే నేను ఇప్పుడే వెళ్లిపోవాలని అనుకుంటున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదేనా?, ఆ ఉద్దేశ్యంతోనే ఆయన నా తల్లిదండ్రులు రాకపోయినా పర్వాలేదు అని అనుకున్నాడా అని విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతోంది అనేది.