Bigg Boss Soniya Akula: బిగ్ బాస్ ఫేమ్ సోనియా(SONIYA AKULA) ఆకుల భర్తకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. పెళ్ళై ఏడాది గడవక ముందే తల్లిని అయ్యానంటూ ఆనందంలో ముంచెత్తింది. సోనియా ఇచ్చిన కాన్ఫిడెన్షియల్ ఫైల్ ఓపెన్ చేసి చూసిన భర్త రియాక్షన్ కి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది…
Also Read: జబర్దస్త్ వదిలేయడానికి హైపర్ ఆదినే కారణం, రీతూ చౌదరి బయటపెట్టిన నిజం
తెలుగు అమ్మాయి సోనియా ఆకుల జార్జి రెడ్డి చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ఆ చిత్రంలో హీరో సిస్టర్ రోల్ చేసింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోనియా ఆకులకు లీడ్ రోల్స్ ఆఫర్ చేశాడు. కరోనా వైరస్, దిశా ఎన్కౌంటర్ చిత్రాల్లో సోనియా ఆకుల హీరోయిన్ గా నటించడం విశేషం. ఆ చిత్రాలేవీ ఆమెకు ఫేమ్ తేలేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8(BIGG BOSS TELUGU)లో సోనియా ఆకుల కంటెస్ట్ చేసింది. అయితే పెద్దగా రాణించలేదు. సోనియా గేమ్ విమర్శలపాలైంది. కన్నడ సీరియల్ నటులు పృథ్వి, నిఖిల్ తో సోనియా చాలా సన్నిహితంగా ఉండేది. వారితో ఆమె ప్రవర్తన ఒకింత అభ్యంతరకరంగా తోచింది.
ఈ క్రమంలో సోనియా పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇద్దరితో ప్రేమాయణం నడుపుతుంది అంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను సోనియా పేరెంట్స్ ఖండించారు. నిఖిల్, పృథ్విలను సోనియా సోదరులుగా భావిస్తుంది. ఆ భావనతోనే చిన్నోడు, పెద్దోడు అని వాళ్ళను సంభోదిస్తుంది. సోనియాను తప్పుగా చూపిస్తున్నారు. ఆమెకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయ్యింది. కాబోయే అత్తమామల అనుమతితోనే బిగ్ బాస్ షోకి వెళ్ళింది. బిగ్ బాస్ షోకి వెళ్లకుంటే ఇప్పటికే వివాహం జరిగేది అని వివరణ ఇచ్చారు.
ఏదేమైనా నెగిటివిటీ మూటగట్టుకున్న సోనియా ఆకుల నాలుగు వారాలకే ఎలిమినేట్ అయ్యింది. చివరి ఎపిసోడ్స్ లో సోనియాకు హౌస్లోకి వెళ్లే అవకాశం దక్కింది. హౌస్లో ఉన్నవారిలో ఎవరి గేమ్ నచ్చలేదో ఆమె చెప్పాల్సి ఉండగా… గతంలో ఎంతో సన్నిహితంగా ఉన్న నిఖిల్ పై ఆమె ఫైర్ అయ్యింది. ఆరోపణలు చేసింది. 2024లో సోనియా ఆకుల వివాహం చేసుకుంది. యష్పాల్ అనే వ్యక్తిని సోనియా ఆకుల కొన్నాళ్లుగా ప్రేమిస్తుంది. అతన్నే వివాహం చేసుకుంది.
Also Read: నాగబాబు, నిహారికపై జబర్దస్త్ ప్రియాంక కామెంట్స్, కన్నీరు కన్నీరు పెట్టుకున్న బిగ్ బాస్ బ్యూటీ
గత ఏడాది డిసెంబర్ లో సోనియాకు వివాహం కాగా.. అప్పుడే గుడ్ న్యూస్ చెప్పింది. తల్లైన విషయాన్ని తనదైన స్టైల్ లో చెప్పింది. సోనియా ఇచ్చిన కాన్ఫిడెన్షియల్ ఫైల్ ని ఓపెన్ చేసిన, యష్పాల్ భార్య తల్లైన విషయం తెలుసుకున్నాడు. అతడి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. సాధారణంగా సెలెబ్స్ పెళ్ళైన చాలా కాలం వరకు ఫ్యామిలీ ప్లానింగ్ చేయరు. సోనియా మాత్రం ఏడాది గడవక ముందే తన కుటుంబంలోకి మరో సభ్యుడిని ఆహ్వానించింది. సోనియా ఆకులకు అభిమానాలు కంగ్రాట్స్ చెబుతున్నారు.