Nobel Peace Prize Twist: గౌరవాన్ని ఎవరైనా కోరుకుంటారు. సత్కారాన్ని ఎవరైనా స్వీకరిస్తారు. ఇక పురస్కారాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో అత్యంత విలువైన పురస్కారంగా నోబెల్ శాంతి బహుమతి ఉంటుంది. ప్రపంచ దేశాలలో శాంతి స్థాపనకు కృషి చేసిన వారికి ఈ పురస్కారం అందిస్తుంటారు. గత ఏడాది అందించిన నోబెల్ శాంతి పురస్కారాన్ని తనకు ఇస్తారని ట్రంప్ భావించాడు. ఎందుకంటే అనేక యుద్దాలను నిలిపివేశానని.. ఆపుదల చేశానని ట్రంప్ పదేపదే చెప్పుకునేవాడు. అందువల్లే తనకు శాంతి బహుమతి వస్తుందని భావించాడు.
Also Read: సీక్రెట్ డేటింగ్ డిన్నర్.. ఏంటయ్యా ట్రంప్–మస్క్ మీ పని.?
ఊహించని విధంగా శాంతి బహుమతి మచాడో కు లభించింది. మచాడో మరెవరో కాదు.. వెనిజులా దేశంలో ప్రతిపక్ష నాయకురాలు . ఆమెకు శాంతి పురస్కారం రావడానికి ట్రంప్ జీర్ణించుకోలేకపోయడు. మచాడో శాంతి పురస్కారాన్ని స్వీకరిస్తుందని ట్రంప్ ఊహించలేకపోయాడు. వాస్తవానికి నోబెల్ కమిటీ ప్రకటించగానే ఆమె దానిని తిరస్కరించి ఉంటే.. ట్రంపు పరపతి మరో విధంగా ఉండేది. ఒకవేళ ఆమె గనుక శాంతి బహుమతిని తిరస్కరించుకుంటే ఈ రోజున వెనిజులా దేశానికి కచ్చితంగా అధ్యక్షురాలు అయ్యేవారని” అమెరికన్ మీడియా వ్యాఖ్యానించింది.
ఇక ఇప్పుడు వెనిజులాలో అధ్యక్ష బాధ్యతలను తాత్కాలికంగా ఉపాధ్యక్షురాలు డెల్సికి అప్పగించారు. దీనిపై అమెరికా కూడా ఆసక్తిని వ్యక్తం చేసింది. ప్రస్తుతం వెనిజులా అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగించాలని విషయంలో తాము జోక్యం చేసుకోబోమని అమెరికా ప్రకటించింది. అది ఆ దేశ ప్రజలకు మంచిది కాదని ట్రంప్ కూడా వ్యాఖ్యానించాడు. చమురు పరిశ్రమల నిర్వాహకులు, వాల్ స్ట్రీట్ లో వ్యాపారులతో డెల్సికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరోవైపు మదురో అరెస్టును డెల్సి తీవ్రంగా ఖండించారు. దీనిపై ట్రంపు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.
Also Read: ప్రజలు వన్ ఛాన్స్ ఇచ్చారు.. 100 ఛాన్సులు మిస్ చేసుకున్న జగన్!
ట్రంప్ వెనిజులా మీద దాడి చేసిన తర్వాత పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అక్కడి చమురు వ్యాపారం లోకి అమెరికా కంపెనీలు ప్రవేశిస్తున్నాయి. తద్వారా చమురు వ్యాపారం మీద ఆధిపత్యాన్ని సాధించడానికి అమెరికా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అంతేకాదు వెనిజులా నుంచి చైనాకు సరఫరా అయ్యే చమురు విషయంలో అమెరికా కంపెనీలు ఆంక్షలు విధించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే చైనాకు సరఫరా చేసే చమురు విషయంలో అమెరికా కంపెనీలు ఆంక్షలు గనుక విధిస్తే అప్పుడు పరిణామాలు వేరే విధంగా మారుతాయని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.