Instagram illegal posts: సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించడం ఈ మధ్య చాలామందికి అలవాటు అయిపోయింది. యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ లాంటి వాటిల్లో వీడియోలు పోస్ట్ చేసి ఇప్పటికే లక్షలు సంపాదించిన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే కొందరు అక్రమంగా సంపాదించి సమాజానికి చెడ్డ పేరుని తీసుకొస్తున్నారు. ఫాలోవర్స్ పెంచుకోవడానికి.. తమ వీడియోలు హైలెట్ కావడానికి.. కాస్త మసాలా జోడిస్తున్నారు. ఇలా జోడించే క్రమంలో కొందరు ఇతరుల ఫోటోలను మార్పింగ్ చేస్తుంటే.. మరికొందరు నేరుగా సగం దుస్తులు వేసి సమాజానికి చీడపురుగుల తయారవుతున్నారు. ఇటువంటి వాటికి ఎక్కువగా గిరాకీ ఉండడంతో చాలామంది ఇవే ఫాలో అవుతున్నారు. అయితే ఇకనుంచి వీటికి చెక్ పెట్టనున్నారు. అదెలా అంటే?
Also Read: బ్యాంకు లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్..
ఇంస్టాగ్రామ్ యాప్ తో చాలామంది కనెక్ట్ అయి ఉన్నారు. ఇందులో డిఫరెంట్ వీడియోలను చూసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇందులో అకౌంట్ ఓపెన్ చేసి తమకు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తే డబ్బులు కూడా సంపాదించవచ్చు. అయితే ఓ వ్యక్తి తన మాజీ ప్రేయసి కి సంబంధించిన పేస్ తో ఏ వీడియోలను తయారు చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు చేశాడు. వీటితో దాదాపు రూ. 10 లక్షల వరకు వచ్చినట్లు సమాచారం. అయితే ఆలస్యంగా చేరుకున్న ఆ ప్రేయసి వెంటనే పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.
మరో కేసులో ఉత్తరప్రదేశ్ కు చెందిన అక్కాచెల్లెళ్లు అసభ్యకరంగా దుస్తులు వేసుకొని డ్యాన్సులు చేస్తూ కనిపించారు. ఇవి రాను రాను మరీ ఎక్కువగా కావడంతో పోలీసులు సుమోటోగా తీసుకొని వీరిని అరెస్టు చేశారు. కేవలం వీరు మాత్రమే కాకుండా చాలామంది అసభ్యకర వీడియోలను తయారు చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు. అయితే వీరిని అడ్డుకునే వారు లేకపోవడంతో మరింతగా రెచ్చిపోతున్నారు.
Also Read: త్వరలో యాపిల్ ఫోల్డబుల్ ఫోన్.. ఫీచర్లు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే
సోషల్ మీడియా యాజమాన్యం ఒకప్పుడు ఇలాంటి వాటి వీడియోల విషయంలో కఠినంగా ఉండేది. కానీ రాను రాను ఖాతాదారుల సంఖ్య పెంచుకునేందుకు ఇలాంటి వాటి వీడియోల పట్ల పెద్దగా పట్టించుకోనట్లు తెలుస్తోంది. కొందరైతే బెడ్ రూమ్ సీన్స్ కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినా.. ఆ వీడియోలు అలాగే ప్రసారం కావడంపై సోషల్ మీడియా యాజమాన్యం ఎలా ప్రవర్తిస్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎవరైనా ఫిర్యాదు ఇస్తే మాత్రం పోలీసులు వెంటనే స్పందించి వారిని అరెస్టు చేస్తున్నారు. కొన్ని విషయాల్లో మాత్రం పోలీసులే సుమోటోగా స్పందిస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు ఇంకా చాలా వరకే ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట వేయాలంటే ఆ యాప్ లో ఉండే అడల్ట్ కంటెక్స్ తొలగించడమే మార్గం. అందుకు ప్రభుత్వం స్పందించి ఇలాంటి వీడియోల పట్ల చర్యలు తీసుకోవాలని కొందరు కోరుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా యాజమాన్యం సైతం ప్రజలకు ఉపయోగపడే కంటెంట్లను మాత్రమే ఉండేలా చూడాలని అంటున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ పోలీసుల మాదిరిగా మరికొందరు కూడా అసభ్యకర వీడియోలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని చర్చ సాగుతుంది. అందువల్ల ఇకనుంచి అలాంటి పోస్టులు పెట్టేవారు ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే.