spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh: కాపులపై వైసీపీ ప్రేమ.. తుని ఘటనలో కేసులు ఎత్తివేత

Andhra Pradesh: కాపులపై వైసీపీ ప్రేమ.. తుని ఘటనలో కేసులు ఎత్తివేత

Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయి. రాబోయే ఎన్నిక‌ల‌ను లెక్క‌లోకి తీసుకుని పార్టీలు త‌మ వ్యూహాలు ఖ‌రారు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కుల సంఘాల‌ను మ‌చ్చిక చేసుకోవాల‌ని చూస్తున్నాయి. గ‌తంలో జ‌రిగిన గొడ‌వ‌ల‌కు నిద‌ర్శ‌నంగా న‌మోదైన కేసుల‌ను మాఫీ చేస్తోంది. తూర్పు గోదావ‌రి జిల్లా తునిలో కాపు ఉద్య‌మ స‌మ‌యంలో చోటుచేసుకున్న ప‌లు కేసుల‌ను ఎత్తివేసింది. ఈ మేర‌కు హోం శాఖ కార్య‌ద‌ర్శి కుమార్ విశ్వ‌జిత్ జీవో జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌భుత్వం కాపు ఓట్ల కోసమే ఇదంతా చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

Andhra Pradesh
Andhra Pradesh

అప్ప‌ట్లో కాపు ఉద్య‌మం తీవ్ర రూపం దాల్చింది. దీంతో త‌మ హ‌క్కుల కోసం స‌మావేశ‌మైన నేత‌లు ఆగ్ర‌హంతో ఊగిపోయి ఏకంగా రైలునే తగ‌ల‌బెట్టారు. అప్ప‌ట్లో ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నం అయింది. దీంతో చాలా మందిపై కేసులు న‌మోద‌య్యాయి. అప్ప‌టి ప్ర‌భుత్వం దీన్ని సీరియ‌స్ గా తీసుకుంది. గొడ‌వ‌కు కార‌ణ‌మైన వారిపై కేసులు పెట్టింది. కానీ ఇప్ప‌టి ప్ర‌భుత్వం వాటిని ర‌ద్దు చేసి వారిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాల‌ని చూస్తోంది.

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు కావాల‌ని డిమాండ్ చేస్తూ ముద్ర‌గడ ప‌ద్మ‌నాభం ఆధ్వ‌ర్యంలో కాపులు నిర‌స‌న చేప‌ట్టారు. రాజ‌కీయంగా కూడా త‌మ‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని అప్ప‌టి ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై నిర‌స‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు రేగాయి. దీంతో ప్ర‌భుత్వం వారిని క‌ట్ట‌డి చేయ‌లేకపోయింది. అప్ప‌ట్లో ఈ ఘ‌ట‌న అత్యంత గొడ‌వ‌ల‌కు కేంద్ర బిందువు అయింది.

Also Read: ఉద్యో గ సంఘాల‌ను ప్ర‌భుత్వం అడ్డుకుంటుందా? చ‌లో విజ‌య‌వాడ‌ను భగ్నం చేస్తుందా?

ప్ర‌స్తుత ప‌రిణామాల్లో వారిపై కేసులు మాఫీ చేయ‌డ‌మంటే వారిని త‌మ పార్టీ వైపు తిప్పుకోవ‌డ‌మే. దీంతో టీడీపీలో భ‌యం ప‌ట్టుకుంది. కాపుల ఓట్ల‌కు గాలం వేసిన వైసీపీ తీరుతో టీడీపీ ఆందోళ‌న చెందుతోంది. రాబోయే ఎన్నిక‌ల్లో కాపుల ఓట్లు త‌మ‌కు ద‌క్క‌వేమోన‌నే బెంగ టీడీపీలో ప‌ట్టుకుంది. దీంతో రాష్ట్రంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధ‌మైన మార్పులు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు.

వైసీపీ ప్ర‌భుత్వం కావాల‌నే కాపుల‌ను త‌మ వైపుకు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలోనే ఓటు బ్యాంకు రాజ‌కీయాల‌కు తెర‌తీసిన‌ట్లు భావిస్తున్నారు. దీని కోస‌మే వైసీపీ వారిని మ‌చ్చిక చేసుకుంటోంది. వారిపై ఉన్న కేసుల‌న్ని మాఫీ చేయించి ఓట్లు రాబ‌ట్టుకోవాల‌ని చూస్తున్న‌ట్లు స‌మాచారం.

Also Read: కేంద్రంపై జ‌గ‌న్ వైఖ‌రి మార్చుకోవాల్సిందే.. ఆ విష‌యాల‌పై ప్ర‌శ్నించ‌కుంటే క‌ష్ట‌మే..!

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

AP Rain Alert

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...
Polavaram Project

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...
Sonam Wangchuk

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...
Pakistan Economy

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper