https://oktelugu.com/

తిరుపతిలో దొంగఓట్లు వేయిస్తున్న వైసీపీ: విష్ణు

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బయట ప్రాంతాల నుంచి కొంతమందిని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయిస్తోందని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు తాజాగా బయట నుంచి వస్తున్న వారిని పట్టుకొని తిరుపతి టీడీపీ, బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలో గెలుపు కోసం ముందే నకిలీ ఐడీ కార్డులు, ఓటర్ల గుర్తింపు కార్డులు తయారు చేసి వైసీపీ పెద్ద ఎత్తున ఇతరప్రాంతాల […]

Written By:
  • NARESH
  • , Updated On : April 17, 2021 / 12:07 PM IST
    Follow us on

    తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బయట ప్రాంతాల నుంచి కొంతమందిని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయిస్తోందని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు తాజాగా బయట నుంచి వస్తున్న వారిని పట్టుకొని తిరుపతి టీడీపీ, బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.

    తిరుపతిలో గెలుపు కోసం ముందే నకిలీ ఐడీ కార్డులు, ఓటర్ల గుర్తింపు కార్డులు తయారు చేసి వైసీపీ పెద్ద ఎత్తున ఇతరప్రాంతాల నుంచి ప్రజలను తీసుకొచ్చి ఓట్లు వేయిస్తోందని విష్ణు ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికలలలో గుంపులుగా వైసిపి నాయకులు, కార్యకర్తలు బయటి ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వందలమందితో దొంగ ఓట్లు వేస్తున్నారని విష్ణు తెలిపారు.

    ఇలా దొంగ ఓట్లు వేసుకుంటే లక్షల ఓట్ల మెజారిటీ వైసిపికి ఏందుకు రాదు? అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఇలాంటి అరాచక శక్తులను ఎన్నికల కమిషన్ అడ్డుకోవాలని సూచించారు. పోలీసులే ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడకపోతే ఎలా ? అని నిలదీశారు.

    వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం ఈ దొంగఓటర్లను నిలువరించాలని.. సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విష్ణు డిమాండ్ చేశారు. రిగ్గింగ్ జరిగిన ప్రాంతాల్లో మళ్లీ రీపోలింగ్ నిర్వహించాలని సూచించారు.

    అధికార పార్టీ మంత్రులు.. ఎమ్మెల్యేలు అక్రమ ఓట్లు ప్రోత్సహిస్తున్నారని విష్ణు ఆరోపించారు. అధికార పార్టీ నేతలను పోలీసులు ఎందుకు కస్టడీలోకి తీసుకోరని నిలదీశారు. ఎన్నికల అధికారులందరూ చేతిలెత్తేసారని.., ఇతర సిబ్బంది అధికార పార్టీ కి తోత్తులుగా వ్వవహరిస్తున్నారని మండిపడ్డారు.

    కాగా తిరుపతిలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చే వారిని కళ్యాణ మండపాల్లో పెట్టారంటూ టీడీపీ నాయకులు తిరుపతిలో ఆందోళన నిర్వహిస్తున్నారు. నకిలీ ఓటర్లు కూలైన్లలో నిలబడ్డారని మాజీ ఎమ్మెల్యే సుగణమ్మ ఆరోపించారు. బీజేపీ విష్ణు వర్ధన్ రెడ్డి సైతం ఇదే ఆరోపణలు తాజాగా చేశారు.