ఆ స్టార్ డైరెక్టర్ కి ఐశ్వర్య రాయ్ కావాలట !

ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ అంటే.. ఎవ్వరు మాత్రం ఇష్టపడరు. ఆమె అందానికి ఎవ్వరు మాత్రం అభిమాని కాకుండా ఉండగలరు. బాలీవుడ్ అందాల భామగా ఆమెకు బాలీవుడ్ లోనే కాకుండా అటు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి క్రేజ్ ఉంది. అందుకే ఐశ్వర్య రాయ్ తో సినిమాలు చేయడానికి పలువురు హాలీవుడ్ దర్శకులు కూడా ఆసక్తి చూపించారు. ఇక లోకల్ దర్శకుల ఎలా ఫీల్ అవుతారో ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. అయితే బాలీవుడ్ దర్శకులకు మాత్రం తమ సినిమాలో […]

Written By: admin, Updated On : April 17, 2021 12:08 pm
Follow us on


ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ అంటే.. ఎవ్వరు మాత్రం ఇష్టపడరు. ఆమె అందానికి ఎవ్వరు మాత్రం అభిమాని కాకుండా ఉండగలరు. బాలీవుడ్ అందాల భామగా ఆమెకు బాలీవుడ్ లోనే కాకుండా అటు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి క్రేజ్ ఉంది. అందుకే ఐశ్వర్య రాయ్ తో సినిమాలు చేయడానికి పలువురు హాలీవుడ్ దర్శకులు కూడా ఆసక్తి చూపించారు. ఇక లోకల్ దర్శకుల ఎలా ఫీల్ అవుతారో ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. అయితే బాలీవుడ్ దర్శకులకు మాత్రం తమ సినిమాలో ఈ ప్రపంచ సుందరిని నటించడానికి ఒప్పించడం అంత ఈజీగా కుదరడం లేదట.

అయితే ఓ హాలీవుడ్ దర్శకుడు ఏకంగా తనకు ఐశ్వర్య రాయ్ తో పనిచేయాలని ఉందని చెబుతున్నాడు. ఇంతకి ఆ హాలీవుడ్ దర్శకుడు ఎవరు అంటే.. జో రుస్సో. ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్స్ ను రాబట్టిన ‘ఎవెంజర్స్ ఎండ్ గేమ్’ చిత్రాన్ని తెరకెక్కించింది ఈ జో రుస్సోనే. అయితే సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో మాట్లాడుతూ.. ఇండియన్ నటీనటులలో మీకు ఎవరితో కలిసి పని చేయాలని ఉంది ? అంటూ క్వశ్చన్ చేశారు ఆయన ఫాలోవర్స్. ఈ సందర్భంగా జో రుస్సో తన మనసులోని మాటను బయటపెట్టాడు.

తనకు ఇండియన్ నటీమణుల్లో ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం అని తెలిపాడు. ఒకవేళ తనకు ఛాన్స్ వస్తే.. ఆమెతో తానూ కలిసి పని చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం ఐశ్వర్య రాయ్ విషయానికి వస్తే.. ఆమె పెళ్లి తరువాత రెగ్యులర్ గా సినిమాలను కంటిన్యూ చెయ్యట్లేదు. కానీ మంచి కథ దొరికితే సినిమాల్లో నటించడానికి రెడీగా ఉంది. ఇక ఇప్పటికే కమర్షియల్ యాడ్స్ లో మాత్రం ఆమె ఫుల్ బిజీగా ఉంది. అన్నట్టు ఐశ్వర్య రాయ్ త్వరలో నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె ఒక యాడ్ ఏజెన్సీని కూడా పెట్టబోతుందట.