Wives extramarital affairs: ఆ మధ్య మియాపూర్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ట్యాంక్ బండ్ మీద నుంచి దూకేసి ఆత్మహత్య చేసుకున్నాడు. దీని వెనక ఒక బలమైన కారణం ఉంది. అతని భార్య ఇష్టానుసారంగా తిరిగేది. అనేక మందితో వివాహేతర సంబంధం పెట్టుకునేది. ఈ విషయం అతడికి తెలుసు. వివాహం జరిగి.. పిల్లలు ఉండడంతో భార్య చేసిన తప్పులను అతను క్షమించాడు. చివరికి ఆమె తన ప్రియుళ్ళను ఇంటికి తీసుకురావడం మొదలుపెట్టింది. వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియోలు షూట్ చేయించుకుని.. వాటిని చూస్తూ ఆనందించేది. అయితే ఆ వీడియోలు బయటికి రావడంతో ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
కేవలం ఇది అతని స్టోరీ మాత్రమే కాదు. సమాజంలో చాలామంది మగాళ్ల పరిస్థితి ఇప్పుడు ఇలానే మారిపోయింది. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఓ మహిళ మానసిక విశ్లేషకురాలు సంచలన విషయాలను వెల్లడించారు. ఒకప్పుడు మగవాళ్ళు వివాహేతర సంబంధాలు పెట్టుకునేవారని.. ఆ సంబంధాలను వారు స్టేటస్ సింబల్ లాగా భావించే వారిని.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని.. మగవాళ్ళ స్థానంలోకి ఆడవాళ్లు వచ్చేసారని ఆమె చెప్పేసింది. తన వద్దకు వచ్చే వారిలో ఎక్కువ శాతం కేసులు ఇవే ఉన్నాయని ఆమె చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.
పైగా నేటి కాలంలో 90% భర్తలు ఇలానే ఉన్నారని.. తమ భార్యలు వివాహేతర సంబంధాలు పెట్టుకున్నప్పటికీ సర్దుకొని ఊరుకుంటున్నారని ఆమె చెప్పుకొచ్చింది. అప్పటికే పెళ్లి కావడం.. పిల్లలు కూడా పుట్టడంతో.. భార్య ఎన్ని తప్పులు చేసిన సరే భర్తలు నిశ్శబ్దంగా ఉండిపోతున్నారని.. పిల్లల కోసం అన్నింటినీ త్యాగం చేస్తున్నారని ఆ మహిళ మానసిక విశ్లేషకురాలు వాపోయింది. భార్యలు ఎన్ని తప్పులు చేసినా సరే భర్తలు నిశ్శబ్దంగా ఉండి పోవడం వల్ల.. కొంతమంది రెచ్చిపోతున్నారని.. విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని ఆ మహిళ మానసిక విశ్లేషకురాలు చెప్పుకొచ్చింది. ఇష్టానుసారంగా తిరిగే మహిళలు కౌన్సిలింగ్ ద్వారా కూడా మారే అవకాశం లేదని ఆ మహిళ విశ్లేషకురాలు వాపోయింది.
ఇటువంటి మనసు కలిగి ఉన్నవాళ్లు పిల్లల్ని కూడా సరిగా పెంచలేరని.. పిల్లలపై కూడా ఆ ప్రభావం పడుతుందని ఆ మహిళ విశ్లేషకురాలు వివరించింది. ఇటువంటి వాళ్లను సాధ్యమైనంతవరకు మార్చేందుకు భర్తలు ప్రయత్నించాలని.. లేనిపక్షంలో దూరంగా ఉండటమే మంచిదని ఆమె చెప్పుకొచ్చారు. తమ సంబంధాలకు అడ్డుపడే వారిని ఏదైనా చేసే మనస్తత్వం ఇటువంటి మహిళల్లో ఉంటుందని.. అటువంటి మహిళలకు గట్టి గుణపాఠం చెబితేనే బాగుంటుందని ఆ మహిళా విశ్లేషకురాలు చెప్పింది. ఆమె మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది.