Illegal relationship: సంబంధంలో నమ్మకం, నిజాయితీ చాలా ముఖ్యమైనవి. ఆరోగ్యకరమైన సంబంధంలో, ఇద్దరూ ఒకరి నుంచి ఒకరు ఏమీ దాచాల్సిన అవసరం లేదు. ఇద్దరికీ ఒకరి ఫోన్ పాస్‌వర్డ్ తెలిసి ఉండాలి. మీ భాగస్వామి కొంతకాలంగా ఈ ఫోన్ విషయంలో వింతగా ప్రవర్తిస్తూ ఉంటే, మీరు అప్రమత్తంగా ఉండాలి అని అర్థం. అయితే ఫోన్ విషయంలో కొన్ని సంకేతాలను గమనించాలి. అప్పుడు మీ భాగస్వామి తప్పుడు రిలేషన్ లో ఉన్నారా? లేదా అనే విషయం మీకు చాలా సులభంగా అర్థం అవుతుంది. మరి వారు చేసే ఆ మిస్టెక్స్ ఏంటంటే?
పాస్ వర్డ్ విషయంలో జాగ్రత్త..
ఈ పాస్ వర్డ్ విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలా విషయాలను అర్థం చేసుకోవచ్చు. ఒకసారి వారి ఫోన్ అడిగి చూడండి. పాస్ వర్డ్ పదే పదే మారుస్తున్నారా? గమనించండి. మీరు పాస్ వర్డ్ అడిగితే లాక్ తీసి ఇస్తున్నారా? లేదా మీకు చెబుతున్నారా? ఒకసారి గమనించండి. ఆ తర్వాత పరిస్థితి ఏంటో కాస్త అర్థం చేసుకోండి.
Read Also: తల్లికి వందనం..రూ.13 వేలు ఫిక్స్.. అనూహ్య నిర్ణయం!
మీరు బయటి నుంచి ఇంటికి వచ్చినప్పుడు మీ భాగస్వామి తన ఫోన్‌ను ఇక్కడ, అక్కడ దాచడం ప్రారంభిస్తే లేదా వారు మిమ్మల్ని చూసిన వెంటనే తన స్క్రీన్‌ను లాక్ చేయడానికి ప్రయత్నిస్తే, ఏదో తప్పు జరిగుతుంది అని అర్థం. తను ల్యాప్‌టాప్, ట్యాబ్‌తో కూడా ఇలాంటివే చేస్తుంటారు కాస్త జాగ్రత్త.
రాత్రిపూట రహస్యంగా సందేశాలు
మీ భాగస్వామి నిద్రపోతుంటే కూడా సందేశాలు పంపిస్తుంటారు. సో మీ పార్టనర్ విషయంలో మీకు ఏమైనా అనుమానంగా అనిపిస్తే రాత్రి నిద్రపోయినట్టు నటించండి. మెసేజ్ లు పంపుతున్నారా? లేదా కాస్త గమనిస్తూ ఉండండి. ఇలాంటివి జరుగుతుంటే ఏదో అనుమానాస్పదంగా ఉందని అర్థం చేసుకోండి. కొన్నిసార్లు మీరు అర్థరాత్రి ఎవరికైనా సందేశం పంపాల్సి రావచ్చు. కానీ అలాంటివి దాయరు. తెలియజేస్తారు. బట్ సీక్రెట్ మెయింటెన్ చేస్తేనే భయపడాలి. అతను దీని గురించి మీతో మాట్లాడకపోతే, అప్రమత్తంగా ఉండండి.
ఫోన్‌ను లాక్
మీరు చుట్టూ ఉన్నప్పుడు మీ భాగస్వామి తన స్క్రీన్‌ను లాక్ చేసి ఉంచుతారు. ఎందుకంటే అతను/ఆమె ఫోన్‌లో ఏమి చేస్తున్నారో మీరు చూడకూడదని అనుకుంటారు. ఫోన్‌ను లాక్ చేసి ఉంచడం సాధారణమే కానీ మీరు చుట్టూ ఉన్నప్పుడు లాక్ చేయడమే కాస్త అనుమానించాల్సిన విషయం.
సందేశాన్ని తొలగించడం
ప్రతి సారి మెసేజ్ లను డిలీట్ చేస్తుంటే కూడా కాస్త ఆలోచించాల్సిందే. మెసేజ్ లు ఎమ్టీ ఉంటే ఏ సంకేతాన్ని వదలడానికి ఇష్టపడటం లేదని అర్థం.
Read Also: ఒక్క పరుగు చేయడానికి 31 బంతులా? ఇలా ఆడితే ట్రోల్ చేయరా మరీ?!
బాత్రూమ్‌కి వెళ్ళేటప్పుడు ఫోన్: కొంతమందికి పాటలు వినడానికి లేదా వార్తలు చదవడానికి బాత్రూమ్ లోపలికి ఫోన్‌లను తీసుకెళ్లే అలవాటు ఉంటుంది. కానీ అతను లేదా ఆమె స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా తన ఫోన్‌ను తనతో తీసుకెళ్లినట్లయితే, అతను లేదా ఆమె ఒక్క క్షణం కూడా తన ఫోన్‌ను మీ ముందు ఉంచుకోవడానికి ఇష్టపడరని అర్థం. అతను లేదా ఆమె తన ఫోన్‌ను బయట ఉంచినప్పటికీ, ఎటువంటి నోటిఫికేషన్‌లు కనిపించకుండా స్క్రీన్‌ను తిప్పి ఉంచుతారు కూడా.
ఏ భాగస్వామి కూడా ఒకరి ఫోన్‌ను ఒకరు 24 గంటలూ ఉపయోగించరు. కానీ అవసరమైనప్పుడు వారు సంకోచం లేకుండా దాన్ని ఉపయోగిస్తారు. మీ భాగస్వామి ఏదైనా పని కోసం తన ఫోన్‌ను ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతించకపోతే, దానికి స్పష్టమైన కారణం చెప్పకపోతే, మీరు అప్రమత్తంగా ఉండాలి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.