Wife and Husband: భార్యాభర్తల బంధం ఎంతో అందమైనది. ఇద్దరు తెలియని వ్యక్తులు కలిసి జీవితాంతం ప్రయాణం చేసే ఈ బంధం శాశ్వతంగా ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు. వివాహం అనే కార్యక్రమం ద్వారా ఒకటయ్యే కపుల్స్ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. ఒకరికొకరు సాయం చేసుకుంటూ జీవితాంతం సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో జీవితంలో ఏ పని చేసిన కలిసే చేయాలని.. కలిసి నడవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే చాణక్య నీతి ప్రకారం కొన్ని పనులను భార్యాభర్తలు కలిసి చేయడం వల్ల దుష్పరిణామాలు ఉంటాయని చెబుతున్నాడు. ఈ పనులను ఎప్పుడు వేరే వేరే చేయాలని.. కలిసి చేయొద్దని చెప్పాడు. ఇంతకీ భార్యాభర్తలు కలిసి చేయకూడని ఆ పనులు ఏవో ఇప్పుడు చూద్దాం..
అపర చాణక్యుడు మానవుల జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన సూత్రాలను ప్రజలకు అందించాడు. ఇందులో భార్యాభర్తలకు సంబంధించిన విషయాలను కూడా వివరించాడు. భార్యాభర్తలు ఎన్నో విషయాల్లో ఒక్కటిగా ఉండాలని.. ఇద్దరూ కలిసే కష్టసుఖాలను పంచుకోవాలని చెప్పిన చాణక్యుడు కొన్ని విషయాల్లో మాత్రం విడివిడిగా ఉండాలని చెబుతున్నాడు.
మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం చాలా అవసరం అని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతూ ఉంటారు. అయితే ఈ ధ్యానం ప్రశాంతమైన వాతావరణంలో చేయాలి. అంతేకాకుండా ధ్యానం చేసేటప్పుడు ఒంటరిగానే ఉండాలి. భార్యాభర్తలు కలిసి ధ్యానం చేయడం వల్ల మనసు పక్క దారికి మల్లుతుంది. అందువల్ల ధ్యానం చేయాలని అనుకునేవారు భార్యాభర్తలు విడివిడిగా చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే ఎవరికి వారు ఉపయోగపడతారు.
దంపతులు ఇద్దరూ కలిసి చదువుకోవాలని అనుకున్నప్పుడు ఒకే ప్రదేశంలో ఉండడం అంతా మంచిది కాదని చాణక్యుడు చెబుతున్నాడు. ఒకే చోట చదువుకోవడం వల్ల దృష్టి మరలుతుందని చెప్పాడు. ఎవరికి వారు సపరేట్ గదిలో లేదా వేరే వేరే ప్రదేశాల్లో చదువుకోవడం మంచిది అని చాణక్యుడు చెప్పాడు.
భార్యాభర్తలు ఇద్దరూ ఒకే చోట ఉద్యోగం చేయడం కూడా ఇబ్బందులకు గురిచేస్తుందని చాణక్యనీతి తెలుపుతుంది. ఎందుకంటే ఒకరి పనితనం గురించి మరొకరికి తెలిసిపోతుంది. ఈ సమయంలో వారి గురించి ఒక్కోసారి తప్పుగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు భార్యాభర్తలు ఇద్దరూ వేర్వేరుగా ఉద్యోగాలు చేయడం మంచిది అని అంటున్నారు. అయితే ఇద్దరూ కలిసి ఒకే వ్యాపారం చేయడం వల్ల లాభాలు ఉండే అవకాశం ఉంది.
భార్యాభర్తల మధ్య ఎన్నో తగువులు ఉంటాయి. అయితే ఒక్కోసారి చెడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇద్దరు ఒకేసారి చెడు నిర్ణయాలు తీసుకోవడం అంతా మంచిది కాదు. ఒకరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మరొకరు సంయమనం పాటించాలి. ఒకరు తీసుకున్న నిర్ణయం తప్పుడు అయితే వారికి నచ్చ చెప్పాలి. వినకపోయినప్పుడు ఎదుటివారు మౌనంగా ఉండటమే మంచిది. కానీ ఇదే సమయంలో మరొకరు కూడా చెడు నిర్ణయం తీసుకోవడం వల్ల ఇద్దరి జీవితాలు సమస్యలను ఎదుర్కొంటాయి.
ఇలా భార్యాభర్తలు చాణక్య నీతి ప్రకారం కొన్ని విషయాల్లో కలిసి చేయకుండా విడివిడిగా చేయడమే మంచిది.