https://oktelugu.com/

TRS MPs : టీఆర్ఎస్ ఎంపీలు రాజీనామాలు చేస్తారా?

TRS MPs :తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. రాజకీయంగా తమ ప్రభావం చూపించేందుకు టీఆర్ఎస్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ రాష్ర్టంలో ఎదుగుతున్న క్రమంలో దానికి చెక్ పెట్టాలని భావిస్తోంది. దీని కోసమే వరి కొనుగోలును వివాదంగా చూపించి కేంద్రంపై విమర్శలు చేసినా ఫలితం మాత్రం కనిపించలేదు. దీంతో బీజేపీని టార్గెట్ చేసుకున్నా టీఆర్ఎస్ కు మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలో బీజేపీకి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే పలు మార్గాలు అన్వేషిస్తోంది. మరోవైపు రాష్ర్టంలో […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 8, 2021 / 11:02 AM IST
    Follow us on

    TRS MPs :తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. రాజకీయంగా తమ ప్రభావం చూపించేందుకు టీఆర్ఎస్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ రాష్ర్టంలో ఎదుగుతున్న క్రమంలో దానికి చెక్ పెట్టాలని భావిస్తోంది. దీని కోసమే వరి కొనుగోలును వివాదంగా చూపించి కేంద్రంపై విమర్శలు చేసినా ఫలితం మాత్రం కనిపించలేదు. దీంతో బీజేపీని టార్గెట్ చేసుకున్నా టీఆర్ఎస్ కు మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలో బీజేపీకి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే పలు మార్గాలు అన్వేషిస్తోంది.

    TRS MPs

    మరోవైపు రాష్ర్టంలో బీజేపీ రోజురోజుకు బలపడుతోంది. దీంతో అది పెరిగితే తమకే నష్టం అనే కోణంలో టీఆర్ఎస్ దాన్ని అడ్డుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ ప్రతిష్టను దిగజార్చేందుకు పావులు కదుపుతోంది. పార్లమెంట్ వేదికగా ధాన్యం కొనుగోలును సాకుగా చూపి విమర్శించినా తగిన ఫలితం మాత్రం దక్కలేదు. దీంతోనే బీజేపీ ఎదుగుదలను ఆపే ప్రయత్నాలు చేస్తోంది.

    టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎంపీల రాజీనామాలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో తమ బలం చూపించుకుని రాబోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు చూస్తున్నట్లు చెబుతున్నారు. కానీ ఒకవేళ పార్టీ ఓడిపోతే దాని ప్రభావం కూడా తీవ్రంగానే ఉండబోతోందని తెలుస్తోంది. అందుకే రాజీనామాలపై డైలమాలో పడిపోయినట్లు సమాచారం.

    Also Read: Pawan Kalyan: ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ అవసరం ఎంత ఉంది?

    గతంలో ఉన్న డేర్ ఇప్పుడు కేసీఆర్ లో కనిపించడం లేదు. ఎంపీల రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళితే అంచనాలు తప్పితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భయపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతోనే ఎంపీల రాజీనామాలపై ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. ఇప్పటికే సర్వేలు సైతం చేయించుకుని తదుపరి అడుగు వేసేందుకు ఆలోచనలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

    Also Read: KCR: కేసీఆర్ ను మోకాళ్లపై కూర్చుండబెట్టి పైకి ఎక్కిన ఈ పిల్లాడు కేటీఆర్ కాదు.. ఎవరో తెలుసా?

    Tags