Pushpa: పరువుతో బన్నీ పోరాటం… అంత ఈజీ కాదు!

Pushpa: బాక్సాఫీస్ యుద్దానికి అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో సిద్ధమవుతున్నాడు. అల్లు అర్జున్ కి ఇది ప్రతిష్టాత్మక చిత్రం. ఆయన నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప. అల్లు అర్జున్ ఇమేజ్ లోకలా.. నేషనలా అనేది పుష్ప విజయం డిసైడ్ చేస్తుంది. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ కొడితే ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతుంది. ఫెయిల్ అయితే ప్రతివాడు పాన్ ఇండియా హీరోనే అంటూ ఎగతాళి చేస్తారు. ఇక పాన్ ఇండియా లెవెల్ లో విజయం […]

Written By: Shiva, Updated On : December 8, 2021 11:11 am
Follow us on

Pushpa: బాక్సాఫీస్ యుద్దానికి అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో సిద్ధమవుతున్నాడు. అల్లు అర్జున్ కి ఇది ప్రతిష్టాత్మక చిత్రం. ఆయన నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప. అల్లు అర్జున్ ఇమేజ్ లోకలా.. నేషనలా అనేది పుష్ప విజయం డిసైడ్ చేస్తుంది. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ కొడితే ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతుంది. ఫెయిల్ అయితే ప్రతివాడు పాన్ ఇండియా హీరోనే అంటూ ఎగతాళి చేస్తారు.

Pushpa

ఇక పాన్ ఇండియా లెవెల్ లో విజయం సాధించడం అంత సులభం కాదు. తెలుగులో హిట్ అయిన చిత్రాలు కూడా ఇతర భాషల్లో ఉసూరుమని పిస్తాయి. కథ, నేటివిటీ, కాస్టింగ్, మేకింగ్ వంటి అనేక కారణాల చేత, మన చిత్రాలు జాతీయస్థాయిలో సత్తా చాటలేవు. సౌత్ ఇండియాలో తెరకెక్కిన చాలా పాన్ ఇండియా చిత్రాలకు బాలీవుడ్ లో చేదు అనుభవం ఎదురైంది. చిరంజీవి నటించిన సైరా చిత్రానికి బాలీవుడ్ లో కనీస ఆదరణ దక్కలేదు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కి బాలీవుడ్ లో సత్తా చాటాలని ప్రయత్నం చేసిన అనేక చిత్రాలకు అక్కడ నిరాశే ఎదురైంది. బాహుబలి సిరీస్ తో పాటు కెజిఎఫ్, సాహో వంటి చిత్రాలు మాత్రమే బాలీవుడ్ లో విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో పుష్ప అక్కడ ఏమాత్రం విజయం సాధిస్తుందనే ఆత్రుత, ఉత్కంఠ అందరిలో నెలకొంది. పుష్ప కథకు నేటివ్ ప్రాబ్లం కూడా ఉంది.

Also Read: Actress Lahari: యాక్సిడెంట్ చేసిన గృహలక్ష్మి సీరియల్ నటి లహరి…

ఇది రాయలసీమ ప్రాంతంలోని శేషాచలం అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. యూనివర్సల్ సబ్జెక్ట్ వంటి అనుకూలతలు కూడా పుష్ప చిత్రానికి లేవు. అయితే సాంకేతికంగా ఉన్నత నిర్మాణ విలువలతో పుష్ప తెరకెక్కింది. అల వైకుంఠపురం లో విజయం తర్వాత అల్లు అర్జున్ పేరు బాలీవుడ్ లో కొంచెం ఫేమస్ అయ్యింది. కాబట్టి పుష్ప మూవీ విజయావకాశాలను కాదనలేం.

మెగా ఫ్యామిలీ నుండి చరణ్ తుఫాన్ చిత్రంతో, చిరంజీవి సైరా చిత్రంతో బాలీవుడ్ పై దండెత్తాలని ప్రయత్నించి విఫలం చెందారు. పుష్ప తో అల్లు అర్జున్ ప్రయత్నం ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి. సౌత్ నుండి బాలీవుడ్ లో విజయాలు సాధించిన హీరోలుగా రజినీకాంత్, కమల్ హాసన్, ప్రభాస్, యష్ ఉన్నారు. మరి ఈ లిస్ట్ లో అల్లు అర్జున్ చేరతారో లేదో చూడాలి.

Also Read: Pawan Kalyan: స్పందించని వకీల్ సాబ్.. సీఎం సాబ్ పై మంటే కారణమా !

Tags