https://oktelugu.com/

Drunkards: కేసీఆర్ కు వ్యతిరేకంగా రోడ్లపైకొచ్చిన మందుబాబులు..!

Drunkards: సీఎం కేసీఆర్ పై మందుబాబులు ఫైర్ అవుతున్నారు. ‘ఓవైపు నువ్వే మందు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తావు..? మరోవైపు నువ్వే డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో ఇరుక్కిస్తావు? ఇదేక్కడి న్యాయమంటూ’ నిలదీస్తున్నారు. డ్రంకన్ డ్రైవ్ టెస్టులు చేస్తున్న ప్రతీసారి ఇలాంటి ప్రశ్నలే వస్తున్నాయి. అయితే ఈసారి మందులు ఏకంగా కేసీఆర్ డౌన్.. డౌన్ అంటూ నినదిస్తూ రోడ్డుపైనే ఆందోళన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తెలంగాణ, ఆంధ్రా సరిహద్దుల్లోని వైన్స్ షాపులకు నిత్యం ఫుల్ డిమాండ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 8, 2021 / 10:50 AM IST

    KCR

    Follow us on

    Drunkards: సీఎం కేసీఆర్ పై మందుబాబులు ఫైర్ అవుతున్నారు. ‘ఓవైపు నువ్వే మందు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తావు..? మరోవైపు నువ్వే డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో ఇరుక్కిస్తావు? ఇదేక్కడి న్యాయమంటూ’ నిలదీస్తున్నారు. డ్రంకన్ డ్రైవ్ టెస్టులు చేస్తున్న ప్రతీసారి ఇలాంటి ప్రశ్నలే వస్తున్నాయి. అయితే ఈసారి మందులు ఏకంగా కేసీఆర్ డౌన్.. డౌన్ అంటూ నినదిస్తూ రోడ్డుపైనే ఆందోళన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

    CM KCR

    తెలంగాణ, ఆంధ్రా సరిహద్దుల్లోని వైన్స్ షాపులకు నిత్యం ఫుల్ డిమాండ్ ఉంటోంది. ఈ మాదిరిగానే జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ఫ్లాజా సమీపంలోని ఓ వైన్ షాపుకు రోజు ఫుల్ గిరాకీ ఉంటోంది. తెలంగాణతోపాటు కర్నూల్, తదితర ప్రాంతాల నుంచి మందుబాబులు ఇక్కడి వచ్చి మద్యం సేవిస్తూ ఉంటారు.

    పాలమూరు జిల్లాలో అత్యధిక రాబడి ఈ వైన్స్ షాపు నుంచే వస్తుందని టాక్ ఉంది. ఈక్రమంలోనే మంగళవారం సాయంత్రం ఉండవల్లి పోలీసులు పూల్లూరు టోల్ ప్లాజ్ వద్ద డ్రంకన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. దీంట్లో భాగంగా వేలాది మంది మందుబాబులు పట్టుబట్టారు. పోలీసులు మందుబాబుల వివరాలు సేకరిస్తున్న సమయంలో వీరంతా వందలాది రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు.

    Also Read: కేసీఆర్ ను మోకాళ్లపై కూర్చుండబెట్టి పైకి ఎక్కిన ఈ పిల్లాడు కేటీఆర్ కాదు.. ఎవరో తెలుసా?

    ఇదే సమయంలో పలువురు మందుబాబులు డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వాహనాలను తీసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులకు, మందుబాబులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కొందరు ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మందు మీరే అమ్ముతారు? కేసులు మీరే పడుతారా? అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు.

    డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్న ప్రతీసారి ఇవే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. అయితే ఇందులో న్యాయం ఉందని కొందరు మద్దతు ఇస్తుంటే.. మరికొందరు  మాత్రం మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. అందరి విషయంలో సాప్ట్ కార్నర్ తో ఉండే సీఎం కేసీఆర్ మందుబాబులకు ఎలాంటి న్యాయం చేస్తారనేది మాత్రం వేచిచూడాల్సిందే..!

    Also Read: టీఆర్ఎస్ ఎంపీలు రాజీనామాలు చేస్తారా?