https://oktelugu.com/

‘విభజన’తో టీడీపీకీ జగన్ స్కెచ్..!

ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఇటీవల ఏడాది పూర్తయింది. ఈ సంవత్సరకాలంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల్లోకి దూసుకెళుతున్నారు. మరోవైపు రాజకీయంగా ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తొలి నుంచే జగన్మోహన్ రెడ్డి టీడీపీని టార్గెట్ చేసినట్లు కన్పిస్తుంది. చంద్రబాబు హయాంలో జరిగిన స్కాములను బయటికి తీసి టీడీపీ నేతలకు వరుసబెట్టి జైల్లోకి పంపుతున్నారు. దీంతో టీడీపీ నేతలు ప్రభుత్వం కక్ష సాధింపు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 13, 2020 / 04:04 PM IST
    Follow us on


    ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఇటీవల ఏడాది పూర్తయింది. ఈ సంవత్సరకాలంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల్లోకి దూసుకెళుతున్నారు. మరోవైపు రాజకీయంగా ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తొలి నుంచే జగన్మోహన్ రెడ్డి టీడీపీని టార్గెట్ చేసినట్లు కన్పిస్తుంది. చంద్రబాబు హయాంలో జరిగిన స్కాములను బయటికి తీసి టీడీపీ నేతలకు వరుసబెట్టి జైల్లోకి పంపుతున్నారు. దీంతో టీడీపీ నేతలు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు పాల్పడుతుందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. వైసీపీ కూడా టీడీపీపై ఎదురుదాడి దిగుతుండటంలో ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

    ఆనంతో… రఘురామ్, ఏం జరుగుతుంది జగన్ ?

    ఏపీలో వైసీపీని బలపరస్తూనే ప్రతిపక్ష టీడీపీని దెబ్బకొట్టేందుకు సీఎం జగన్ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ కు జై కొడుతున్నారు. చంద్రబాబు హయాంలో మంత్రులు పదవులు అనుభవించిన వారుసైతం ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే టీడీపీకి హ్యండిచ్చి వైసీపీ పక్షంలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉండగానే ఏపీలో జిల్లాల విభజన అంశాన్ని జగన్ వ్యూహాత్మకంగా పైకి తీసుకొచ్చి టీడీపీని దెబ్బకొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారనే టాక్ విన్పిస్తుంది.

    జిల్లాల విభజనతో టీడీపీ అనుకూలంగా ఉన్న జిల్లాల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో రాజకీయ వేడి రాజుకున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాను విభజించవద్దని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరుతున్నారు. నెల్లూరును విభజిస్తే కొన్ని ప్రాంతాలు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో కలుస్తాయని దీంతో జిల్లా రూపురేఖలు మారిపోతాయని ఆందోళన చెందుతున్నారు. వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు సైతం శ్రీకాకుళం జిల్లాను విభజించొద్దని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ నేతలు తమ జిల్లాలను విభజించొద్దని కోరుతుండటం గమనార్హం.

    జగన్ పట్టుదల.. టెక్ దిగ్గజం ఏపీకి..

    అయితే విభజనతో టీడీపీకి గట్టి షాక్ తగిలే అవకాశం ఉండటంతో జగన్మోహన్ రెడ్డి ఆదిశగా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా, జిల్లాలను విభజించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జగన్ నిర్ణయంతో టీడీపీ తీవ్ర నష్టం కలుగనుందని ఈమేరకు చంద్రబాబు నాయుడికి దృష్టికి నేతలు తీసుకెళ్లారు. జిల్లాల విభజనతో టిడిపి ఓటు బ్యాంకు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని, బలమైన నియోజకవర్గాల్లో పట్టు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పినట్లు తెలుస్తోంది.

    ప్రస్తుతం సీఎం జగన్ జిల్లాల విభజనపై కసరత్తు మాత్రమే చేస్తున్నారని ఇంకా నిర్ణయం తీసుకోలేదని చంద్రబాబు టీడీపీ నేతలు చెబుతున్నారు. అంతలా జిల్లాల విభజనపై ప్రభుత్వం ముందుకెళితే పెద్ద ఎత్తున పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. సంస్కృతి, వారసత్వ సంపద ఎన్నోఏళ్లుగా ఉన్న వేషభాషలపై ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చి జిల్లాల విభజన బ్రేక్ వేసేలా టీడీపీ ప్లాన్ చేస్తోంది.

    జిల్లాల విభజనకే ప్రభుత్వం మొగ్గుచూపితే రానున్న రోజుల్లో టీడీపీ మరింత గడ్డుపరిస్థితి ఎదురయ్యేలా అవకాశాలు కన్పిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన టీడీపీ జగన్ వ్యూహానికి ప్రతివ్యూహాన్ని రచిస్తుంది. దీంతో విభజన అంశం ఏ పార్టీకి షాకిస్తుందోననే చర్చ ఆసక్తిని రేపుతోంది.