తప్పుల మీద తప్పులు కాంగ్రెస్ రారాజు కొంప ముంచుతున్నాయి. ఇప్పటికే బీజేపీ సహా ప్రతిపక్షాలు ఆయనను ‘పప్పు’ అంటూ విమర్శిస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో అగ్రస్థానంలో ఉన్న రాహుల్ గాంధీ కనీస పరిజ్ఞానం లేకుండా రాజకీయాల్లో ఒక ఫెయిల్యూర్ నాయకుడిగా మిగిలిపోతున్నాడన్న చర్చ జాతీయ స్థాయిలో జరుగుతోంది. మొన్నటి లాక్ డౌన్ వేళ రాహుల్ గాంధీ చేసిన పనులు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. వలస కూలీల వద్దకు స్వయంగా వెళ్లి వారి కష్టాలు తెలుసుకొని వాహనాలు సమకూర్చి మరీ వారి రాష్ట్రాలకు రాహుల్ గాంధీ పంపారు. ప్రాథమిక సమస్యలపై రాహుల్ గాంధీకి ఉన్న అవగాహన సీరియస్ విషయాల్లో కొరవడిందనే అపవాదు ఉంది. ఇప్పుడది నిరూపితమైంది.
చైనాపై సర్జికల్స్ స్ట్రయిక్ తప్పదా?
తాజాగా చైనా-భారత సైనికులు గాల్వాన్ లోయలో ఘర్షణపడ్డారు. ఇందులో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. దీనిపై రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఆయనను నవ్వుల పాలు చేసింది.ఒక జాతీయ నేత కనీసం పరిజ్ఞానం లేకుండా ఇలా చేయడంతో ఆయన అభాసుపాలయ్యారు. తన అజ్ఞానాన్ని రాహుల్ గాంధీ బయటపెట్టుకున్నట్టు అయ్యింది. భావి ప్రధానిగా కాంగ్రెస్ లో అందరూ అనుకుంటున్న రాహుల్ గాంధీ ఇలా చేయడంపై విమర్శలు చెలరేగాయి.
20 మంది భారత సైనికుల మృతికి నివాళులర్పిస్తూ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఆయన అపరిపకత్వతను తెలియజేసింది. అంతమంది భారత సైనికులు చనిపోతుంటే వారి చేతికి తుపాకులు ఎందుకు ఇవ్వలేదని రాహుల్ గాంధీ డిమాండ్ చేసిన తీరు అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. ఒక భారతీయ ఎంపీగా, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా చేసిన రాహుల్ గాంధీ భారత్-చైనా వాస్తవాధీన రేఖ వద్ద ఎందుకు తుపాకులు తీసుకెళ్లలేదోనన్న విషయం కూడా అవగాహన లేకపోవడంపై చాలా మంది నెటిజన్లు సెటైర్లు వేశారు.
కవిత ఎన్నిక.. బస్తీమే సవాల్ అంటున్న అన్నదమ్ములు..!
భారత్-చైనా 1962 యుద్ధం తర్వాత రెండు దేశాలు కలిసి సరిహద్దుల్లో తుపాకులు వినియోగించరాదని నిర్ణయం తీసుకున్నాయి. 1980తోపాటు 2005లో కూడా ఈ ప్రొటోకాల్ నిబంధనలను ఇరు దేశాలు ఆమోదించాయి. తుపాకులను ఎవరూ పేల్చరాదని.. సరిహద్దుల్లో వాటిని వినియోగించరాదని ఇరు సైన్యాలు అంగీకరించాయి. ఈ ఒప్పందం స్వయంగా రాహుల్ గాంధీ బామ్మ అయిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలోనే ఒకటి జరగడం విశేషం.
తాజాగా రాహుల్ గాంధీ ట్వీట్ కు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కౌంటర్ ఇచ్చారు. మీ బామ్మ ఇందిరాగాంధీ హయాంలోనే చైనా సరిహద్దుల్లో తుపాకులు వాడవద్దని నిర్ణయించారని.. మీకు అవగాహన లేకుంటే చరిత్ర తెలుసుకోవాలని రాహుల్ గాంధీని ఎద్దేవా చేశారు.
ప్రధాని కావాలనుకుంటున్న రాహుల్ గాంధీ నోటి నుంచి ఇలాంటి ట్వీట్లు రావడం నిజంగా ఎవ్వరూ ఊహించనది. ఆయనకు తెలియకున్నా.. కనీసం మంచి పరిజ్ఞానం ఉన్న మీడియా మేనేజ్ మెంట్ సలహాదారులను తన సోషల్ మీడియా గ్రూపులో పెట్టుకున్నా ఇలాంటి అపవాదులను ఆయన తప్పించుకునే అవకాశం ఉంటుంది. లేదంటే ఇలానే నవ్వుల పాలు కాకతప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
– నరేశ్ ఎన్నం