సీఎం తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..!

భారత్-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో 20మంది భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెల్సిందే. వీరిలో తెలంగాణకు చెందిన సంతోష్ బాబు ఉన్నారు. సూర్యాపేట జిల్లాకు చెందిన సంతోష్ బాబు ఆర్మీలో కల్నల్ స్థాయి హోదాలో విధులు నిర్వహిస్తున్నారు. ఇండో-చైనా బోర్డర్లో సోమవారం జరిగిన రాత్రి జరిగిన ఘర్షణలో సంతోష్ బాబు మృతిచెందిన సంగతి తెల్సిందే. సంతోష్ బాబు పార్థివదేహానికి ప్రభుత్వం అధికార లాంఛనాలతో వీడ్కోలు పలికింది. అయితే వీరజవానుకు నివాళి అర్పించేందుకు సీఎం కేసీఆర్ రాకపోవడంపై […]

Written By: Neelambaram, Updated On : June 19, 2020 5:19 pm
Follow us on


భారత్-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో 20మంది భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెల్సిందే. వీరిలో తెలంగాణకు చెందిన సంతోష్ బాబు ఉన్నారు. సూర్యాపేట జిల్లాకు చెందిన సంతోష్ బాబు ఆర్మీలో కల్నల్ స్థాయి హోదాలో విధులు నిర్వహిస్తున్నారు. ఇండో-చైనా బోర్డర్లో సోమవారం జరిగిన రాత్రి జరిగిన ఘర్షణలో సంతోష్ బాబు మృతిచెందిన సంగతి తెల్సిందే. సంతోష్ బాబు పార్థివదేహానికి ప్రభుత్వం అధికార లాంఛనాలతో వీడ్కోలు పలికింది. అయితే వీరజవానుకు నివాళి అర్పించేందుకు సీఎం కేసీఆర్ రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి.

దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబుకు సూర్యాపేట వాసులు కన్నీటితో వీడ్కోలు పలికింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై కల్నల్ పార్థీవ దేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. మంత్రి కేటీఆర్, ఎంపీ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు సంతోష్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అయితే స్వతహాగా ఉద్యమకారుడైన సీఎం కేసీఆర్ జవాన్ కుటుంబానికి అండగా ఉంటాయని ప్రకటించారే తప్ప కల్నల్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించడానికి వెళ్లలేదు. కేసీఆర్ తీరుపై తెలంగాణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ మృతిచెందిన సమయంలో సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లిమరీ అతడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల మృతి చెందినపుడు కూడా సీఎం ఆమె భౌతిక కాయానికి నివాళి అర్పించారు. కృష్ణను దగ్గరకు తీసుకొని ఓదార్చారు. ఇవన్నీ చేసిన కేసీఆర్.. తెలంగాణ గడ్డ మీద పుట్టి, దేశం కోసం అమరుడైన వీరజవానుకు నివాళి అర్పించే తీరిక లేకుండా పోయిందా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సినిమా వాళ్లకు ఇచ్చిన గౌరవం కూడా జవాన్లకు ఇవ్వరా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ వీరజవాన్ పట్ల ఇలా వ్యవహారిస్తే ఛత్తీస్‌గఢ్‌‌ సీఎం మాత్రం వీరజవాను శవపేటికను భుజాలపై మోసి తన దేశభక్తిని చాటుకున్నారు. చైనాతో జరిగిన ఘర్షణలో సంతోష్ బాబుతోపాటు ఛత్తీస్‌గఢ్‌‌కు చెందిన జవాన్ గణేశ్ రామ్ కుంజామ్ కూడా అమరుడయ్యాడు. దీంతో గణేశ్ రామ్ భౌతికకాయం వద్ద సీఎం భూపేశ్ భాగేల్ అంజలి ఘటించడంతోపాటు అతడి శవపేటికను తన భుజాలపై మోశారు. అమర జవాన్ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దేశం కోసం ప్రాణం అర్పించిన వీరజవాన్ల పట్ల ఏవిధంగా వ్యవహరించాలో ఛత్తీస్‌గఢ్‌‌ సీఎం ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.