Rupee Falling: రూపాయి విలువ పడిపోతే మనకేమవుతుంది..?

Rupee Falling: మన దినచర్యలో భాగమైన రూపాయి క్షీణించింది… డాలర్ తో పోలిస్తే రూ.80 వరకు పెరిగింది.. రూపాయి క్షీణిస్తే దేశానికి నష్టం.. అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే చాలా మంది సామాన్యులు రూపాయి క్షీణిస్తేమనకేంటి నష్టం..? అనే భావనలో ఉన్నారు. రోజూవారీ ఖర్చులు ఎలాగూ ఉంటాయి. వచ్చే ఆదాయం వస్తుంది.. ఇలాంటప్పుడు రుపాయ క్షీణిస్తే మాకేం అవుతుంది..? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే భారత్ లో ప్రతి ఆర్థిక వ్యవహారం రూపాయితోనే సాగుతుంది. ఇలాంటప్పుడు ప్రతీ […]

Written By: NARESH, Updated On : July 24, 2022 2:55 pm
Follow us on

Rupee Falling: మన దినచర్యలో భాగమైన రూపాయి క్షీణించింది… డాలర్ తో పోలిస్తే రూ.80 వరకు పెరిగింది.. రూపాయి క్షీణిస్తే దేశానికి నష్టం.. అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే చాలా మంది సామాన్యులు రూపాయి క్షీణిస్తేమనకేంటి నష్టం..? అనే భావనలో ఉన్నారు. రోజూవారీ ఖర్చులు ఎలాగూ ఉంటాయి. వచ్చే ఆదాయం వస్తుంది.. ఇలాంటప్పుడు రుపాయ క్షీణిస్తే మాకేం అవుతుంది..? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే భారత్ లో ప్రతి ఆర్థిక వ్యవహారం రూపాయితోనే సాగుతుంది. ఇలాంటప్పుడు ప్రతీ వస్తువు ధర రూపాయి మారకంపైపే ఆధారపడుతాయి. రూపాయి విలువ క్షీణిస్తే ఆర్థిక లోటు ఏర్పడి ధరలు పెరుగుతాయి. రూపాయి విలువ బాగుంటేనే ధరలు తగ్గుతాయి. అయితే రూపాయి విలువ తగ్గితే మన జీవన విధానంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై స్పెషల్ ఫోకస్.

Rupee Falling

జూలై 18 నాటికి రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే 79.89 గా నమోదైంది. ఆ మరుసటి రోజు రూ.80కి పడిపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపై రకరకాల మీమ్స్ తో విమర్శలు వెల్లువెత్తాయి. రూపాయి విలువ తగ్గడంతో ‘దేశం నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయింది’ అని జాతీయ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా విమర్శించారు. రూపాయి ఇంత క్షీణిస్తున్నా మీరు నిశ్శబ్ధంగా ఉన్నారని అన్నారు. అయనతో పాటు మరికొందరు కూడా రూపాయి క్షీణతపై మోదీని విమర్శించారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ రూపాయి ఇంతలా క్షీణించలేదని అన్నారు.

Also Read: India Population: 41 కోట్ల కోత.. దారుణంగా పడిపోనున్న భారత జనాభా

రూపాయి క్షీణించడంతో ఆ ప్రభావం మొదటగా ద్రవ్యోల్భణం పై పడుతుంది. రూపాయి మారకం విలువ తగ్గితే వస్తువుల ధరలు పెరుగుతాయి. దేశంలో 80 శాతం చమురు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు రూపాయి విలువ తగ్గితే ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. రూపాయి విలువ తగ్గడం వల్ల వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఎక్కువ వడ్డీ రేట్లు ఆదాయంపై ప్రభావం చూపుతాయి. 2016లో నోట్ల రద్దు, 2017లో జీఎస్టీ అమలు తరువాత ఇప్పుడిప్పడు సంస్థలు పలు మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతున్నాయి. ఇప్పుడు రూపాయి విలువ తగ్గడం వల్ల మరో రకంగా పన్నులు విధించే అవకాశం ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లతో భారత్ అనేక విషయాల్లో సంబంధాలు పెట్టుకుంది. కొన్ని సంస్థల నుంచి తెచ్చుకున్న అప్పులకు వడ్డీ రేట్లు చెల్లించాల్సి ఉంటుంది. రూపాయి మారకం విలువ తగ్గి డాలర్ రేటు పెరగడం వల్ల ఆ వడ్డీ రేటు పెరిగితే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తారు. ఇప్పటికే అప్పుల భారం పెరిగిపోయిన భారత్ కు వడ్డీరేట్లు పెరిగి నష్టాల్లోకూరుకుపోవచ్చు.

Rupee Falling

ఇతర దేశాల నుంచి ఎలక్ట్రానిక్, ఇంజనీరింగ్, రసాయనాలను దిగుమతి చేసుకుంటున్నాం. భారత్ దాదాపు 65 శాతం ఎలక్ట్రానిక్ వస్తువుల కోసం ఇతర దేశాలపై ఆధారపడుతోంది. క్షీణిస్తున్న రూపాయి మొబైల్ ఫోన్ల తయారీ దారులపై ఒత్తిడి పెంచుతుంది. ఇప్పటికే భారత్ లో ఉన్న పోటీ కారణంగా అవి తక్కువ మార్జిన్లతో పనిచేస్తున్నాయి. దిగుమతి ధరలు ఎక్కువవడంతో మొబైల్ సంస్థలు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంతకాలం ఎల్ ఈడీ లైట్లు తక్కువ ధరకు లభించేవి. ఇప్పుడు వాటి ధరలను కూడా పెంచే సూచనలో ఉన్నారు.

దిగమతులే కాకుండా ఎగుమతులపై రూపాయి క్షీణత ప్రభావం ఉంటుంది. ఐటీ, ఔషధాలు, టెక్స్ టైల్స్, తదితర రంగాల్లో భారత్ ఎగుమతులను చేస్తుంది. ఇప్పటికే చైనాతో వాణిజ్య యుద్ధం కారణంగా పలు వస్తువుల ధరలు పెంచేశారు. ఇప్పుడు ఈ క్షీణతతో వస్తువుల ఎగుమతులపై ప్రభావం పడి లాభాలు పొందలేకపోతారు. ఇలా మిగతా వస్తువుల ధరలు పెరగడంతో ఆ ప్రభావం ఇతర వస్తువులు, చివరికి ఆహార వస్తువులపై పడి సామాన్యులపై ప్రభావం చూపుతోంది. అయితే రూపాయి విలువ పూర్తిగా పడిపోకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అవి ఎంతవరకు ఫలితాలిస్తాయో చూడాలి.

Also Read:Governor Tamilisai: ఆకాశంలోనూ గవర్నర్ చేసిన మంచి పని ఏంటో తెలుసా?

Tags