Minister KTR: తెలంగాణ రాష్ట్ర సమితి భవిష్యత్ ఆశాకరిణం.. ప్రస్తుత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎం కేసీఆర్ తనయుడు కల్వకుంట్ల తారకరామారావు 46 పుట్టిన రోజు వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు, పార్టీ నేతలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయన బర్త్‌డే వేళ పార్టీ క్యాడర్‌లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఈ సందర్భంగా కేటీఆర్‌కు సంబంధించిన ప్రతి డీటెయిల్ ఈ రోజంతా వైరల్ అవుతోంది. రీసెంట్ గా రాయదుర్గంలోని నాలెడ్జ్ హబ్ లో టీ–హబ్ 2 ప్రారంభోత్సవం సందర్భంగా ఓ ప్రముఖ బిజినెస్ యూట్యూబర్ తన్మయ్ భట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోని అంశాలు నెటిజన్లకు ఆసక్తి కలిగిస్తున్నాయి.
– రెగ్యులర్ ప్రోగ్రామ్స్‌లో ప్రొఫెషనల్‌గా కనిపించే కేటీఆర్ ఈ ఇంటర్వ్యూలో చాలా ఫ్రెండ్లీగా.. జోవియల్‌గా.. నవ్వుతూ సరదాగా కబుర్లు చెప్పారు. ఈ సందర్భంగా తన కుటుంబం, పిల్లలు, టైం పాస్, తండ్రి కేసీఆర్, రాజకీయాలు, విజయాలు, లక్ష్యాల గురించి చెప్పారు.
Also Read: Rupee Falling: రూపాయి విలువ పడిపోతే మనకేమవుతుంది..?
– ఇంట్లో పిల్లల అల్లరి గురించి చెబుతూ కేటీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘మీ పిల్లలు బుద్ధిమంతులేనా’ అని అడిగిన్పపుడు.. ఇలాంటి ఇంటర్వ్యూల్లో కెమెరా ముందు ఔను అని చెప్పక తప్పదని కేటీఆర్ ముసిముసిగా నవ్వారు. ‘నేను రాష్ట్ర ప్రజలకు మంత్రిని అయినా ఇంట్లోకి వెళ్తే మాత్రం వాళ్లకు జస్ట్ తండ్రిని మాత్రమే. వాళ్లదే పెత్తనమంతా. టీవీ రిమోట్ కూడా వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. వాళ్ల తెలివితేటలు, మాటలు విని కొన్ని పదాలు వాళ్ల స్టైల్లో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే.. ఇది అవసరమా అని నన్ను ఎగతాళి చేస్తుంటారు. వాళ్ల తీరు చూస్తే.. నేనే పదేళ్ల కిందటే స్ట్ర్టక్ అయిపోయానేమో అనిపిస్తుంది’ అని కామెంట్ చేశారు కేటీఆర్.
Also Read:Drunken Female Teacher: మద్యం తాగి పాఠశాలకు వచ్చిన టీచర్.. ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా?