https://oktelugu.com/

Jr NTR: టీడీపీ నేతలకు జూ.ఎన్టీఆర్ ఎందుకు టార్గెట్ అయ్యారు? అసలు కథేంటి?

Jr NTR: చంద్రబాబు విషయంలో జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించిన తీరు ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. ఆయనపై టీడీపీ నేతలే ఆరోపణలు చేస్తున్నారు. మేనత్త విషయంలో మేనల్లుడు స్పందించే తీరు అదేనా అని టీడీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. కుటుంబ సభ్యులకు అన్యాయం జరిగితే ఆగ్రహం రాకపోగా ఏదో ప్రవచనాలు చెప్పినట్టు వీడియో రిలీజ్ చేయడం వెనుక ఆంతర్యమేమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో జూనియర్ ఎన్టీఆర్ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మేనత్తకు జరిగిన అవమానంపై మేనల్లుడు ఉగ్రరూపంతో ఊగిపోతారని అందరు […]

Written By:
  • Shiva
  • , Updated On : November 26, 2021 10:49 am
    Follow us on

    Jr NTR: చంద్రబాబు విషయంలో జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించిన తీరు ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. ఆయనపై టీడీపీ నేతలే ఆరోపణలు చేస్తున్నారు. మేనత్త విషయంలో మేనల్లుడు స్పందించే తీరు అదేనా అని టీడీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. కుటుంబ సభ్యులకు అన్యాయం జరిగితే ఆగ్రహం రాకపోగా ఏదో ప్రవచనాలు చెప్పినట్టు వీడియో రిలీజ్ చేయడం వెనుక ఆంతర్యమేమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో జూనియర్ ఎన్టీఆర్ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
    Jr NTR
    మేనత్తకు జరిగిన అవమానంపై మేనల్లుడు ఉగ్రరూపంతో ఊగిపోతారని అందరు భావించినా అదేమీ కనిపించలేదు. మామూలు వ్యక్తిలా సాధారణంగా ఏదో వినోదం చేసినట్లు మాట్లాడటం ఏమిటనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తీరుపై సహజంగానే విమర్శలు వస్తున్నాయి. అదీ టీడీపీ నేతలే చేస్తున్నారు. వర్ల రామయ్య, బుద్దా వెంకన్న వంటి నేతలు ఎన్టీఆర్ స్పందనపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.

    ఇదంతా టీడీపీ డ్రామాలో మరో ఎత్తుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో చంద్రబాబు పార్టీని వీడి జూనియర్ ఎన్టీఆర్ కు బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ను ఎలాగైనా డ్యామేజ్ చేయాలనే పట్టుదలతో టీడీపీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయనపై విమర్శలు ఎక్కుపెట్టి ఆయనలో రాజకీయ కాంక్షను తగ్గించాలనే వాదన బలంగా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోనే జూనియర్ ఎన్టీఆర్ వీడియోపై వివాదాలు చోటుచేసుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో పలు వాదనలు తెరపైకి వస్తున్నాయి.

    Also Read: NTR Kodali nani: ఎన్టీఆర్ ప్రియుశిష్యులైన కొడాలి నాని, వంశీకి విభేదాలు ఎక్కడ వచ్చాయి? ఎందుకు విడిపోయారంటే?

    రాబోయే 2024 ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే అన్ని దారులు వెతుకుతున్నట్లు చెబుతున్నారు. సానుభూతిని కూడా క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే బాబు ఇలా చేశారని కూడా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మొత్తానికి టీడీపీ పూర్వ వైభవం కోసం పాకులాడుతోంది. అధికారమే లక్ష్యంగా వ్యూహాలు ఖరారు చేసుకుంటోంది. ఇందు కోసమే జూనియర్ ఎన్టీఆర్ ను కూడా పావుగా వాడుకుంటోందని ప్రచారం సాగుతోంది.

    Also Read: AP Cinema Regulation Amendment Bill: చిత్రపరిశ్రమ బతకాలంటే సినీ పెద్దలు ఏం చేయాలి?

    Tags