Betel Leaves Benefits: ఇంట్లో ఏదైనా పూజ జరిగితే తమలపాకులు కచ్చితంగా ఉండాల్సిందేనని తెలిసిందే. అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో తమలపాకులు ఎంతగానో ఉపయోగపడతాయి. రోజుకు రెండు తమలపాకులను తినడం వల్ల సులభంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. తమలపాకు నమలడం వల్ల నోటి దుర్వాసన, నోటిపూత సమస్యలు తగ్గుతాయనే సంగతి తెలిసిందే.
చిగుళ్లకు ఎంతో మేలు చేయడంలో తమలపాకు తోడ్పడుతుందని చెప్పవచ్చు. శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో తమలపాకు ఉపయోగపడుతుంది. దగ్గు, ఆయాసంతో బాధపడే పిల్లలు ఆవనూనెలో తమలపాకులను నానబెట్టి కొంత సమయం పాటు వేడి చేసి చాతీపై రుద్దాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ఉపశమనంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.
Also Read: కేరళ రాష్ట్రంలో కొత్తరకం వైరస్.. లక్షణాలు ఏమింటే?
గొంతు భాగంలో తమలపాకు రసాన్ని రుద్దడం ద్వారా గొంతు మంట, ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. తమలపాకులను నూరి తమలపాకుల రసాన్ని గాయాలపై రాస్తే గాయాలు త్వరగా మానిపోయే ఛాన్స్ ఉంటుంది. వెన్నునొప్పితో బాధ పడేవాళ్లు తమలపాకులను కొబ్బరినూనె రసంలో కలిపి వీపు వెనుక భాగంలో రాస్తే ఆ సమస్య దూరమవుతుంది. తమలపాకుల రసంతో చెవిపోటు సమస్యకు సైతం చెక్ పెట్టవచ్చు.
ప్రతిరోజూ తమలపాకులు నమలడం ద్వారా అజీర్తి సమస్య దూరమవుతుంది. తమలపాకులలో సున్నం కలిపి తీసుకోవడం ద్వారా అర్థరైటిస్ తో బాధ పడేవాళ్లు ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు. తమలపాకు క్యాన్సర్ నిరోధక కారకంగా పని చేస్తుందని చెప్పవచ్చు. విటమిన్ సి ఎక్కువగా ఉండే తమలపాకులను తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ ను పెంపొందించుకోవడం సాధ్యమవుతుంది.