https://oktelugu.com/

రష్యన్ అమ్మాయి నుంచి రఘురామ వైన్ ఎందుకు తాగాడంటే?

ఆ మాత్రం కళాపోషణ లేకపోతే ఆయన నర్సాపురం ఎంపీ ఎందుకవుతారు..? సీఎం జగన్ నే ఎందుకు ఢీకొంటారు. ఎక్కడ దొరికినా తప్పించుకోవడం ఎంపీ రఘురామకే చెల్లిందని తాజాగా నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. తాజాగా ఎంపీ రఘురామ ఓ పార్టీలో చేసిన పని వైరల్ అయ్యింది. దాన్ని కూడా ఆయన సమర్థించుకోవడం విశేషం. ‘అయినా నేనొక్కడినే తాగుతున్నానా? చాలా మంది వైసీపీ నేతలు, సినిమా ప్రముఖులు, క్రికెటర్లు తాగుతుంటారు.. అయినా తాగితే తప్పేంటి?’ అంటూ వైసీపీ రెబల్ ఎంపీ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 12, 2020 / 08:49 PM IST
    Follow us on

    ఆ మాత్రం కళాపోషణ లేకపోతే ఆయన నర్సాపురం ఎంపీ ఎందుకవుతారు..? సీఎం జగన్ నే ఎందుకు ఢీకొంటారు. ఎక్కడ దొరికినా తప్పించుకోవడం ఎంపీ రఘురామకే చెల్లిందని తాజాగా నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. తాజాగా ఎంపీ రఘురామ ఓ పార్టీలో చేసిన పని వైరల్ అయ్యింది. దాన్ని కూడా ఆయన సమర్థించుకోవడం విశేషం.

    ‘అయినా నేనొక్కడినే తాగుతున్నానా? చాలా మంది వైసీపీ నేతలు, సినిమా ప్రముఖులు, క్రికెటర్లు తాగుతుంటారు.. అయినా తాగితే తప్పేంటి?’ అంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కాస్త గట్టిగానే బదులిచ్చాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. రెండు మూడు రోజుగా మన ఎంపీ రాజుగారి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎంపీ రఘురామ ఓ రష్యన్ లేడి నుంచి వైన్ తాగుతున్న ఫొటో షేర్ చేస్తూ తెగ ట్రోలింగ్ చేస్తున్నారట.. దీంతో ఉండబట్టలేక ఆయన బయటపడి అసలు నిజం చెప్పేశాడు.

    Also Read: సీఎం జగన్ కు మరో షాక్.. లిమిట్స్ అన్నీ దాటేశారంటూ సుప్రీంలో పిటిషన్..?

    తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫొటో తెగ హల్ చల్ చేస్తోంది. రఘురామకృష్ణం రాజు ఓ పార్టీలో అర్థనగ్నంగా బట్టలు వేసుకున్న ఒక అందమైన రష్యాన్ డ్యాన్సర్ మీద నుంచి షాంపైన్ పోస్తుండగా.. రఘురామ ఆబగా తాగుతున్న ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫొటో చూస్తే ఎవ్వరైనా రఘురామపై విమర్శలు చేస్తారు. బాధ్యతాయుతమైన ఎంపీ పోస్టులో ఉండి ఇలా పబ్లిక్ గా ఎంజాయ్ చేస్తావా? అంటూ ఆడిపోసుకుంటారు. ఈ ఫొటోపై రఘురామ స్పందించారు. తనను తాను రక్షించుకోవాలని సోషల్ మీడియాలో ట్రోల్స్ కు సమాధానం ఇవ్వాలని ప్రయత్నించాడు.

    సోషల్ మీడియాలో తాను రష్యన్ అమ్మాయి నుంచి షాంపేన్ వైన్ తాగుతున్న ఫొటో వాస్తవమేనని రఘురామ తెలిపాడు. రెండు రోజులుగా ట్రోల్ చేశారని.. ఆ ఫొటో వెనుక స్టోరీని చెప్పుకొచ్చారు. మూడేళ్ల క్రితం జరిగిన పార్టీలో ఈ ఫొటో తీశారని.. ఆ ఫొటో ఎప్పుడూ చూడలేదని.. ఈ ఫొటో అందించిన పెద్దలు.. బహుశా వైసీపీ అధిష్టానంలోని ఓ సీనియర్ నేత అనుకుంటున్నట్టు రఘురామ ఆరోపించాడు.

    ఇక ఆ ఫొటోలో తప్పేముంది అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. షాంపైన్ క్రికెటర్లు తాగుతారని.. తాను తాగడంలో తప్పేముందున్నారు. కోల్ కతా, హైదరాబాద్ గుర్తులేదు కానీ.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ ఎంపీగారి కుమారుడు ఇచ్చిన ఫంక్షన్ లో ఫొటో తీశారని రఘురామ అన్నారు. ఆ సెలెబ్రేషన్స్ లో భాగంగా అందరి నోట్లో షాంఫైన్ పోశారని.. తన నోట్లోనూ పోశారని రఘురామ వివరణ ఇచ్చారు.

    Also Read: ఏపీ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన జగన్ సర్కార్..?

    చివర్లో ఈ నెపాన్ని కాస్త వైసీపీ వాళ్లకు రఘురామ అంటించాడు. వైసీపీ వాళ్లు ఇచ్చిన పార్టీల్లో ఇవన్నీ కామన్ అని.. రష్యన్ అమ్మాయిలు ఉంటారని అన్నారు. తాను ఏమీ అసభ్యంగా మాట్లాడలేదని.. ఎవరి మీద చేతులు వేయలేదని అన్నారు. షాంపైన్ పోస్తే తాగానన్నారు. తనతోపాటు చాలా మంది నేతలు తాగారంటూ మరకను అందరికీ అంటించేశాడు. ఇక ఆ ఫొటోను తీసుకొని ఉన్మాదుల్లా రెచ్చిపోయారు అంటూ సోషల్ మీడియా ట్రోలర్స్ పై రఘురామ మండిపడ్డారు.