https://oktelugu.com/

అర్హ కోసం దిండుగా మారిన అయాన్!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ మరియు, కూతురు అర్హకు సంబంధించిన కొన్ని అందమైన వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ తో తరచుగా పంచుకుంటూ ఉంటాడు. పైగా టాలీవుడ్ క్యూట్ కిడ్స్‌లో ముందు వరుసలో ఉండేది అల్లు వారి చిచ్చర పిడుగులే. ముఖ్యంగా అర్హ పలికే ముద్దు ముద్దు మాటలకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక అల్లు అర్జున్ కూడా అయాన్, అర్హలతో కలిస్తే చిన్న పిల్లవాడిగా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : October 12, 2020 / 08:39 PM IST
    Follow us on


    స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ మరియు, కూతురు అర్హకు సంబంధించిన కొన్ని అందమైన వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ తో తరచుగా పంచుకుంటూ ఉంటాడు. పైగా టాలీవుడ్ క్యూట్ కిడ్స్‌లో ముందు వరుసలో ఉండేది అల్లు వారి చిచ్చర పిడుగులే. ముఖ్యంగా అర్హ పలికే ముద్దు ముద్దు మాటలకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక అల్లు అర్జున్ కూడా అయాన్, అర్హలతో కలిస్తే చిన్న పిల్లవాడిగా మారిపోయి మరీ ఎంజాయ్ చేస్తుంటాడు. వీరు చేసే అల్లరి చేష్టలతో ఇళ్లంతా సందడి సందడిగా మారుతుందట. పెళ్లి టాపిక్‌ పై ఈ తండ్రీ కూతుళ్ల మధ్య జరిగే వాదనను ఇప్పటికే అందరూ చూశారు.

    పెళ్లి టాపిక్ నే కాకుండా దోశ స్టెప్ ఇలా బన్నీ- అర్హల మధ్య జరిగే సంభాషణల వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. దీనికితోడు అయాన్, అర్హల అల్లరి గురించి అల్లు స్నేహారెడ్డి నిత్యం ఏదో ఒకటి అప్ డేట్ ఇస్తూనే ఉంటుంది. తండ్రితో దాగుడు మూతలు ఆడుతున్న అర్హ వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇటివలే ఇంటి ఫ్లోర్‌ను ఎలా నాశనం చేసిందో కూడా చెప్పింది స్నేహారెడ్డి. చేతికి రంగులు పూసుకుని ఇంటి ఫ్లోర్‌ పై డ్రాయింగ్ వేయడం, చేతులను, నేలను నాశనం చేయడం గురించి స్నేహారెడ్డి ఫోటోల రూపంలో నెటిజన్లతో పంచుకున్న సంగతి కూడా తెలిసిందే. కాగా తాజాగా అల్లు పిల్లల అనుబంధం గురించి ఓ ఫోటో షేర్ చేసింది. అల్లు అయాన్ హాయిగా పడుకుంటే.. ఆ అయాన్ ను దిండుగా చేసుకుని అర్హ చక్కగా పడుకుంది. చెల్లి కోసం అయాన్ దిండుగా మారిపోవడం బన్నీ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంది.