https://oktelugu.com/

శానిటైజర్లు వాడేవారిని హెచ్చరించిన ఎయిమ్స్ వైద్యులు..?

కరోనా వైరస్ విజృంభణ, లాక్ డౌన్ ముందు వరకు మనలో చాలామందికి శానిటైజర్ పరిచయం లేదు. కరోనా విజృంభణ తరువాత చేతుల ద్వారా ముక్కు లేదా నోటిలోకి కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శానిటైజర్ ను వినియోగించాలని సూచనలు చేశాయి. ఫలితంగా దేశంలో శానిటైజర్ల వినియోగం విపరీతంగా పెరిగింది. నగరాల నుంచి మారుమూల పల్లెల వరకు ప్రజలు శానిటైజర్లను వాడుతున్నారు. అయితే ఎయిమ్స్ వైద్యులు ఎక్కువగా శానిటైజర్లను వాడే వాళ్లకు షాకింగ్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 12, 2020 / 08:55 PM IST
    Follow us on

    కరోనా వైరస్ విజృంభణ, లాక్ డౌన్ ముందు వరకు మనలో చాలామందికి శానిటైజర్ పరిచయం లేదు. కరోనా విజృంభణ తరువాత చేతుల ద్వారా ముక్కు లేదా నోటిలోకి కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శానిటైజర్ ను వినియోగించాలని సూచనలు చేశాయి. ఫలితంగా దేశంలో శానిటైజర్ల వినియోగం విపరీతంగా పెరిగింది. నగరాల నుంచి మారుమూల పల్లెల వరకు ప్రజలు శానిటైజర్లను వాడుతున్నారు.

    అయితే ఎయిమ్స్ వైద్యులు ఎక్కువగా శానిటైజర్లను వాడే వాళ్లకు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఎయిమ్స్ వైద్య నిపుణుల బృందం శానిటైజర్లు ఎక్కువగా వాడే వాళ్లు భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని అన్నారు. శానిటైజర్లు ఎక్కువగా వాడే వారిలో మందులు వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులపై ప్రభావం చూపించే అవకాశాలు తగ్గిపోతాయని ఎయిమ్స్ నిపుణుల బృందం వెల్లడించింది.

    శానిటైజర్ల వినియోగం ఇదే విధంగా కొనసాగితే ప్రమాదమని తెలుపుతున్నారు. ఔషధాలను ఎక్కువగా వినియోగిస్తే మరో మూడు దశాబ్దాల తర్వాత సంవత్సరానికి కోటి మంది ప్రమాదంలో పడుతుందని చెప్పారు. ఎయిమ్స్ డాక్టర్ రామచౌదరి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. శానిటైజర్ల వినియోగం మరింత పెరిగితే భవిష్యత్తులో పరిస్థితులు మరింత దారుణంగా ఉందని అన్నారు.

    కరోనా వైరస్ గురించి వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు పరిస్థితులు ఇదే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. 2021 సంవత్సరం జనవరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.