https://oktelugu.com/

Janasena Chief Pawan Kalyan: పవన్ కు ఏపీ కంటే తెలంగాణపై ఎందుకంత ప్రేమ?

Janasena Chief Pawan Kalyan:ఏపీలో పర్యటించిన ప్రతీసారి పవన్ కళ్యాణ్ తెలంగాణ ఉద్యమ చరిత్రను నొక్కివక్కాణిస్తుంటాడు. అక్కడి ప్రజలు, నేతలు, ఉద్యోగులు కలిసి కట్టుగా చేసిన ఉద్యమాన్ని వేయినోళ్ల పొగుడుతుంటారు. అంతటి పట్టుదల స్ఫూర్తి, ఏపీ ప్రజల్లోనూ రావాలని ఆరాటపడుతుంటారు. సమైక్యాంధ్ర కోసం ఏపీ ప్రజలు, నేతలు పోరాటం చేసి విఫలమైన తీరును ఉదహరిస్తుంటారు. ఏపీ ప్రజల్లోనూ తెలంగాణ ప్రజల్లోని ఆ పట్టుదల రావాలని కోరుతుంటారు. ఎందుకంటే హుజూరాబాద్ లో ఈటలను ఓడించడానికి కోట్లు కుమ్మరించినా కానీ […]

Written By:
  • Dharma
  • , Updated On : July 17, 2022 / 12:24 PM IST
    Follow us on

    Janasena Chief Pawan Kalyan:ఏపీలో పర్యటించిన ప్రతీసారి పవన్ కళ్యాణ్ తెలంగాణ ఉద్యమ చరిత్రను నొక్కివక్కాణిస్తుంటాడు. అక్కడి ప్రజలు, నేతలు, ఉద్యోగులు కలిసి కట్టుగా చేసిన ఉద్యమాన్ని వేయినోళ్ల పొగుడుతుంటారు. అంతటి పట్టుదల స్ఫూర్తి, ఏపీ ప్రజల్లోనూ రావాలని ఆరాటపడుతుంటారు. సమైక్యాంధ్ర కోసం ఏపీ ప్రజలు, నేతలు పోరాటం చేసి విఫలమైన తీరును ఉదహరిస్తుంటారు. ఏపీ ప్రజల్లోనూ తెలంగాణ ప్రజల్లోని ఆ పట్టుదల రావాలని కోరుతుంటారు. ఎందుకంటే హుజూరాబాద్ లో ఈటలను ఓడించడానికి కోట్లు కుమ్మరించినా కానీ టీఆర్ఎస్ ను గెలిపించలేదు. అదే ఏపీలో పవన్ కళ్యాణ్ పోటీచేసిన రెండు చోట్ల కోట్లు కుమ్మరిస్తే ప్రత్యర్థులను గెలిపించారు. అక్కడికి , ఇక్కడికి తేడాను చెబుతూ పవన్ కళ్యాణ్ ఎన్నో సార్లు ఆంధ్రాప్రజలు మారాలని.. నీతిగా , నిజాయితీగా రాజకీయాలను చేసేవారిని గెలిపించాలని కోరుతుంటారు. 2019 ఎన్నికల్లో అది సాధ్యం కాలేదు. కనీసం 2024 ఎన్నికల్లోనైనా పవన్ కళ్యాణ్ ఆకాంక్ష నెరవేరుతుందా? లేదా? అన్నది చూడాలి.

    జనసేనాని పవన్ కళ్యాణ్ దూకుడు మీద ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను చుట్టేస్తున్నారు. అటు ప్రజలు సైతం పవన్ పర్యటనకు బ్రహ్మరథం పడుతున్నారు. శనివారం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించిన పవన్ కు జన సైనికులు నీరాజనం పలికారు. అయితే పవన్ మాత్రం ఏపీ ప్రజల మూడ్ ను నమ్మడం లేదు. ఏపీ ప్రజల కంటే తెలంగాణ ప్రజలే విభిన్నంగా ఆలోచిస్తారని వ్యాఖ్యానించారు. ఇది మా రాష్ట్రం… అన్నివిధాలా అభివృద్ధి చేసుకోవాలని తెలంగాణ ప్రజల్లో అభిప్రాయం ఉంటుంది కానీ.. ఏపీ విషయానికి వస్తే మాత్రం పలానా నాయకుడు మా కులం వాడు… మావర్గం వాడు అని ఆలోచిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కులం నాయకుడు ఎంత పెద్ద తప్పుచేసినా సర్దుకుపోతారని.. కానీ తెలంగాణలో మాత్రం చైతన్యవంతంగా ఆలోచిస్తారని చెప్పారు. అందుకే ఏపీలో కులాన్ని వాడుకొని నేతలు భారీగా లబ్ధి పొందుతున్నారని.. ప్రజలు మాత్రం అలానే ఉండిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో తీరు మారనంత వరకూ పరిస్థతి ఇలానే ఉంటందని హెచ్చరిస్తున్నారు. ఏపీలో కుల జాడ్యం వీడితేనే రాష్ట్రం బాగుపడుతుందని.. అప్పటివరకూ ఏమీ చేయలేమని పవన్ తేల్చిచెబుతున్నారు.

    Pawan Kalyan

    ఉద్యమాల మధ్య తేడా అదే..
    ముఖ్యంగా పవన్ తన ప్రసంగంలో నాటి తెలంగాణ, సమైఖ్యాంధ్ర ఉద్యమాల మధ్య వైరుడ్యాన్ని ఉదహరించి చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమం అంతగా ఎగసిపడడానికి అక్కడి నేతలు, ప్రజల్లో చిత్తశుద్ధే కారణమని చెప్పారు. కానీ ఆ స్థాయిలో ఇక్కడి ప్రజలు సమైఖ్యాంధ్ర ఉద్యమంలో చొరవ చూపకపోవడం వల్లే నీరుగారిపోయిందని పవన్ గుర్తుచేస్తున్నారు.

    Also Read: Pawan Kalyan- Film Industry: పవన్ కళ్యాణ్ సీఎం.. జనసేన వైపు సినీ పరిశ్రమ టర్న్?

    నాడు సమైఖ్యాంధ్ర ఉద్యమ సమయంలో నేతలు కూడా ప్రజలను అప్రమత్తం చేయలేకపోయారని.. వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియజెప్పేందుకు ప్రయత్నించలేదని పవన్ గుర్తుచేస్తున్నారు. అందుకే సమైఖ్యాంధ్ర ఉద్యమం ఫెయిలైందని.. రాష్ట్ర విభజన జరిగిందని చెబుతున్నారు. ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రజల విజయమని..ఏపీ ప్రజలు చేసిన దౌర్బాగ్యమని పవన్ నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తుంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాల భావసారుప్యతను చూపిస్తూ ఏపీ ప్రజల సెంటిమెంట్లను అధిగమించలేకపోవడాన్ని పవన్ తప్పుపడుతున్నారు. వీటన్నింటికీ కుల రాజకీయాలే కారణమని పవన్ చెబుతున్నారు. తెలంగాణలో కేవలం అభివృద్ధినే చూస్తారని.. ఏపీలో మాత్రం కులాన్ని చూస్తారని.. అటువంటప్పుడు మార్పు ఎలా వస్తోందని పవన్ ప్రశ్నిస్తున్నారు.

    Pawan Kalyan

    అధికారానికి దాసోహం..
    చిత్తశుద్ధితో పార్టీ స్థాపించి ప్రజా సమస్యలపై పోరాడుతుంటే ప్రజలు కనీసం గుర్తింపునివ్వలేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేస్తే…రెండింటా ఓడించారని.. అటువంటప్పుడు తాను సమస్యలపై ఎలా పోరాడగలనని వాపోయారు. కనీసం ఒకచోటైనా గెలిపించి ఉంటే మీ గురించి శాసనసభలో పోరాడి ఉండేవాడినని చెబుతున్నారు. ఇది ముమ్మాటికీ ప్రజలు చేసిన తప్పిదంగా పవన్ అభివర్ణిస్తున్నారు. అదే తెలంగాణలో అయితే అక్కడి ప్రజలు అవకాశాన్ని జారవిడుచుకునే వారు కాదన్నారు. అందుకు అక్కడ ఉప ఎన్నికలనే ఉదహరిస్తున్నారు. ‘దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టినా విపక్ష బీజేపీకే పట్టం కట్టారు. హోరాహోరీ పోటీలో అధికార పక్షం స్పీడును కళ్లెం వేశారు. అటు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం విపక్షాలకు గౌరవప్రదమైన సీట్లు కట్టబెట్టారు. కానీ ఏపీలో మాత్రం అందుకు విరుద్ధం. ఉప ఎన్నికల్లో కనీసం విపక్షాలకు చోటులేకుండా చేశారు. ప్రజలు కనీస మద్దతు తెలపలేదు. కేవలం సంక్షేమ పథకాలు, నగదుకు ఆశించి ఏకపక్షంగా అధికార పార్టీకి విజయం అందించారు. బద్వేలు, తిరుపతి, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అధికార వైసీపీనే మొగ్గుచూపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం అదే తీర్పును కొనసాగించారు’ అంటూ పవన్ అన్నారు. తెలంగాణతో ఏపీకి ఉన్న వైరుద్యాన్ని గుర్తుచేశారు.

    ఏపీ ప్రజలు పోరాడేవారికి.. ప్రజల కోసం నిలబడే వారికోసం పాటు పడాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు లాగా ఎన్నికల్లో ఎవరైతే తమకోసం నిలబడుతారో వారికే పట్టం కట్టాలని.. డబ్బులకు అమ్ముడు పోవద్దని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు. అప్పుడే ప్రజాస్వామ్యం బలంగా నిలబడుతుందని ఆకాంక్షిస్తున్నారు. అందుకే ఏపీ కంటే కూడా తెలంగాణపై పవన్ ప్రేమ కురిపించడానికి ఇదే కారణంగా చెబుతున్నారు.

    Also Read:Jagdeep Dhankhar: వెంకయ్యకు షాక్ లగా.. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్ కర్?

    Tags