Homeజాతీయ వార్తలుBJP- Jharkhand: బీజేపీ తరువాత స్కెచ్ ఆ రాష్ట్రంపైనే.. అలా చేస్తుందన్న మాట

BJP- Jharkhand: బీజేపీ తరువాత స్కెచ్ ఆ రాష్ట్రంపైనే.. అలా చేస్తుందన్న మాట

BJP- Jharkhand: మహారాష్ట్ర ఎపిసోడ్ ముగిసింది. మరాఠి పీఠంపై ఏక్ నాథ్ షిండేను కూర్చోబెట్టారు. తరువాత రాష్ట్రం ఏదీ అన్న చర్చ ఇప్పడు ప్రారంభమైంది. అయితే బీజేపీ పెద్దలు మాత్రం తెలంగాణ అనే తమ చేతల ద్వారా చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ, షా ద్వయం స్వయంగా రాష్ట్రాన్ని సందర్శించి తమ తరువాత టార్గెట్ తెలంగాణ అని స్పష్టమైన సంకేతాలు పంపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ పీఠంపై బీజేపీ జెండా ఎగురవేయాలని పావులు కదుపుతున్నారు. అధికార టీఆర్ఎస్ తో హోరాహోరీగా తలపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందుతామన్న బీజేపీ పెద్దలు దీమాతో ఉన్నారు. అయితే ఇంతలో మరో రాష్ట్రంపై బీజేపీ ఫోకస్ పెట్టిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పది రోజుల కిందట జార్కండ్ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ పై ఐటీ దాడులు జరగడంతో.. తదుపరి టార్గెట్ జార్కండ్ పైన అని తేటతెల్లమైంది. అయితే దీనిపై హేమంత్ సోరెన్ అప్రమత్తమయ్యారు. ఏకంగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించడం ద్వారా బీజేపీ పెద్దల ఆగ్రహాన్ని కాస్త తగ్గించుకోగలిగారు. తమ రాష్ట్రంలో గిరిజన జనాభా ఎక్కువ కాబట్టి.. ఆ వర్గానికి చెందిన ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపామని హేమంత్ సోరెన్ బయటకు ప్రకటించినా.. అదంతా ఐటీ దాడులతోనేనని అందరికీ తెలిసిన విషయం. జార్కండ్ ఆవిర్భావం తరువాత జార్కండ్ ముక్తీ మోర్చా కాంగ్రెస్ తో సుదీర్ఘ కాలం పయనిస్తూ వస్తోంది. కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థిని కాదని ..ఎన్డీఏ మద్దతుదారుకు మద్దతు ప్రకటించం హాట్ టాపిక్ గా మారింది. ఇందులో రాజకీయం ఏదీ లేదని.. కేవలం గిరిజన వర్గానికి చెందినందునే ద్రౌపది ముర్ముకు మద్దతు తెలపాల్సి వచ్చిందని సోరెన్ చెబుతున్నారు. కానీ ఇది జేఎంఎం, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఉనికిపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

BJP- Jharkhand
Hemant Soren-Amit shah

ఐటీ దాడులతో హెచ్చరిక..
అయితే జార్కండ్ ను కూడా మరో మహారాష్ట్రగా తయారుచేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారుట. అందుకే సోరెన్ కు స్పష్టమైన సంకేతాలు పంపరుట. ముందుగా ఐటీ దాడులు పేరిట భయం పుట్టించారుట. తద్వారా సోరెన్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నరుట. నేరుగా ద్రౌపది ముర్ముకు మద్దతు తెలపాలని కోరారుట. అయితే ఈ పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఈ వ్యూహం వెనుక జేఎంఎం తో కలిసి సర్కారు ఏర్పాటుచేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.

Also Read: Janasena Chief Pawan Kalyan: పవన్ కు ఏపీ కంటే తెలంగాణపై ఎందుకంత ప్రేమ?

దానికి సోరెన్ కానీ వ్యతిరేకిస్తే మహారాష్ట్ర ఉదంతాన్ని తెరపైకి చూపి భయపెడుతున్నారని తెలుస్తోంది. అయితే దీనికి సోరెన్ అవునని కానీ.. కాదని కానీ చెప్పలేదు. రాష్ట్రపతి ఎన్నికల అనంతరం చూసుకుందామని చెప్పినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ సుదీర్ఘ కాలం కాంగ్రెస్ తో ప్రయాణాన్ని సోరెన్ తెంచుకుంటారా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే దీనిపై జేఎంఎం పార్టీలో మాత్రం భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలు బీజేపీ తమను సంప్రదించనే లేదని ఆ పార్టీ కీలక నాయకులు చెబుతున్నారు.

BJP- Jharkhand
BJP- Jharkhand

దేశాన్ని చుట్టేయ్యాలని…
కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ అన్ని రాష్ట్రాలను వశపరచుకోవాలని బీజేపీ పెద్దలు అభిప్రాయంగా టాక్ నడుస్తోంది. జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. నేరుగా ఎన్నికల్లో బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో పాగా వేసింది. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఉన్న చోట మాత్రం అక్కడ ప్రత్యేక వ్యూహాలను రూపొందిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు నడుపుతూనే.. ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసిందన్న అపవాదును బీజేపీ మూట గట్టుకుంది. ఈ నేపథ్యంలో గత రెండేళ్లుగా ఒక్కో రాష్ట్రంను హస్తగతం చేసుకుంది. మొన్నటికి మొన్న మహారాష్ట్రను వెనుకుండి తతంగం నడిపించి చేక్కించుకోగా… నేడు జార్కండ్ పై కన్నేయడం చర్చనీయాంశమైంది.

Also Read:Junior NTR: సినిమా పేరు ని తన ఇంటి పేరుగా పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్.. షాక్ లో ఫాన్స్

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version