భారత్‌ను ప్రశంసిస్తున్న డబ్ల్యూహెచ్ఓ

చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని బెంబెలేత్తిస్తుంది. చైనా నుంచి క్రమంగా అన్నిదేశాలకుపాకి మరణ మృందంగం చేస్తుంది. అగ్రరాజ్యాలు సైతం కరోనా దాటికి విలవిలలాడిపోతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికే 2లక్షలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా 20వేల మంది మృతిచెందారు. అభివృద్ధిలో ముందుండే అమెరికా కరోనాతో మృతిచెందిన కేసుల్లో తొలిస్థానంలో నిలవడం శోచనీయంగా మారింది. ఇటలీ, స్పెయిన్, చైనా, బ్రిటన్, యూకే దేశాలు కరోనాను కట్టడిలో చేయడంలో విఫలమవుతున్నారు. కాగా భారత్ కరోనా విషయంలో త్వరగా […]

Written By: Neelambaram, Updated On : April 14, 2020 6:25 pm
Follow us on


చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని బెంబెలేత్తిస్తుంది. చైనా నుంచి క్రమంగా అన్నిదేశాలకుపాకి మరణ మృందంగం చేస్తుంది. అగ్రరాజ్యాలు సైతం కరోనా దాటికి విలవిలలాడిపోతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికే 2లక్షలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా 20వేల మంది మృతిచెందారు. అభివృద్ధిలో ముందుండే అమెరికా కరోనాతో మృతిచెందిన కేసుల్లో తొలిస్థానంలో నిలవడం శోచనీయంగా మారింది. ఇటలీ, స్పెయిన్, చైనా, బ్రిటన్, యూకే దేశాలు కరోనాను కట్టడిలో చేయడంలో విఫలమవుతున్నారు. కాగా భారత్ కరోనా విషయంలో త్వరగా మేల్కోవడంతో కొంతమేర కరోనా కట్టడిని చేయగలిగింది.

కరోనా కేసులు దేశంలో 10వేల కేసులకు చేరడం ఆందోళన కలిగిస్తుంది. రేపటి దేశంలో లాక్డౌన్ ముగిస్తుందనగా ప్రధాని మోదీ మంగళవారం జాతినుద్దేశించి మరోసారి మాట్లాడారు. ఈ సందర్భంగా లాక్డౌన్ మే 3వరకు కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని నిర్ణయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. కరోనాపై సమనుకూలంగా భారత్ కఠిన నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేసింది. అయితే కరోనా ఫలితాలపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు చర్య అవుతుందని డబ్ల్యూహెచ్‌వో రీజనల్ డైరెక్ట్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ తెలిపారు. లాక్డౌన్ వల్ల సామాజిక దూరంగా, కేసుల నిర్ధారణ, ఐసోలేషన్, కరోనా పాజిటివ్ వచ్చిన వారి కాంటాక్టులను గుర్తించడం తేలిక అవుతుందని ఆయన తెలిపారు.

లాక్డౌన్ నిర్ణయంతో ఆర్థికంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ కరోనాపై పోరులో భారత్ కృతనిశ్చయంతో ఉందని పూనమ్ ప్రశంసించారు. కరోనాపై విజయం సాధించడానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కరోనాపై భారత్ చేస్తున్న పోరాటాన్ని డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జే ర్యాన్ గతంలోనే ప్రశంసించారు. భారత్ గతంలోనే స్మాల్ పాక్స్, పోలియా మహమ్మరులను నిర్మూలించిందన్నారు.