https://oktelugu.com/

సమంత వంటను రుచి చూడలేదు: అమల

హీరోయిన్ సమంత సినిమాల్లోనే వంట చేస్తుంది.. నిజజీవితంలో ఆమెకు వంట రాదని తేలింది. ఈ విషయాన్ని ఆమె అత్తగారు స్వయంగా ఓ ఇంటర్య్యూలో వెల్లడించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సమంత యాక్టింగ్ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందం, అభినయంతో సామ్ దక్షిణాదిలో అగ్ర కథానాయికగా కొనసాగుతుంది. 2017లో నాగచైతన్యను వివాహాం చేసుకున్న తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ అందరినీ అలరిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వూలో సమంత అత్తగారు అమలకు ఏ ప్రశ్న ఎదురైంది. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 14, 2020 / 06:20 PM IST
    Follow us on


    హీరోయిన్ సమంత సినిమాల్లోనే వంట చేస్తుంది.. నిజజీవితంలో ఆమెకు వంట రాదని తేలింది. ఈ విషయాన్ని ఆమె అత్తగారు స్వయంగా ఓ ఇంటర్య్యూలో వెల్లడించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సమంత యాక్టింగ్ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందం, అభినయంతో సామ్ దక్షిణాదిలో అగ్ర కథానాయికగా కొనసాగుతుంది. 2017లో నాగచైతన్యను వివాహాం చేసుకున్న తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ అందరినీ అలరిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వూలో సమంత అత్తగారు అమలకు ఏ ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె చెప్పిన సమాధానం ఆసక్తిని రేపుతోంది.

    ‘సమంత మీ కుటుంబ సభ్యుల కోసం ఎప్పుడైనా వంట చేశారా?’ అనే ప్రశ్న అమలను అడుగగా లేదని సమాధానం సమాధానం చెప్పింది. అనంతరం ఆమె నవ్వుతూ.. సమంతకే కాదు.. నాకు కూడా వంట రాదని తెలిపింది. మా ఇంట్లో మంచి కుక్ ఉన్నాడని నాగార్జునను ఉద్దేశించి చెప్పింది. నాగర్జున ఉండగా వేరొకరు వంట చేయాల్సిన అవసరం లేదని సమాధానం ఇచ్చింది. నాగార్జున లాగే చైతన్య కూడా మంచి వంటగాడని సమంత కూడా పలు సందర్భాల్లో చెప్పింది. నాగచైతన్య వంటింట్లో వంట చేస్తున్న ఫొటోలను ఇన్ స్ట్రాగ్రామ్లో పోస్టు చేసిన సంగతి తెల్సిందే. దీనిని బట్టి అత్త కోడళ్లు ఇంట్లో వంట చేయరని అర్థం అవుతుంది. కాగా తండ్రికొడుకులు తమ భార్యలకు వంట చేసి పెడితే వాళ్లిద్దరు హ్యాపీలా లాగించేస్తారన్నమాట.

    ప్రస్తుతం నాగచైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ స్టోరీ’లో నటిస్తున్నాడు. ఇందులో చైతూకీ జోడిగా సాయిపల్లవి నటిస్తుంది. అలాగే ‘నాగేశ్వర్ రావు’ అనే సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీలో చైతుకు జోడీగా రష్మిక నటిస్తుంది. కాగా సమంత ‘జాను’ మూవీ తర్వాత ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సీరిస్ లోనటిస్తుంది. అలాగే రెండు సినిమాలకు సైన్ చేసినట్లు సమాచారం.