దేశంలో మాస్ టెస్టింగ్ కీలకం!

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడికి బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యల పై కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేశారు. “దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఎంత ముఖ్యమో.. అదే స్థాయిలో మాస్ టెస్టింగ్ కూడా కీలకం అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. లావోస్, నైజర్ మరియు హోండురాస్ వంటి తక్కువ అభివృద్ధి చెందిన దేశాల కంటే కరోనా పరీక్షా స్థాయిలు అత్యల్పంగా భారత్ లో ఉన్నాయని రాహుల్ పేర్కొన్నారు. ఇదే విషయం […]

Written By: Neelambaram, Updated On : April 14, 2020 6:34 pm
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడికి బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యల పై కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేశారు. “దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఎంత ముఖ్యమో.. అదే స్థాయిలో మాస్ టెస్టింగ్ కూడా కీలకం అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. లావోస్, నైజర్ మరియు హోండురాస్ వంటి తక్కువ అభివృద్ధి చెందిన దేశాల కంటే కరోనా పరీక్షా స్థాయిలు అత్యల్పంగా భారత్ లో ఉన్నాయని రాహుల్ పేర్కొన్నారు.

ఇదే విషయం పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మనీష్ తివారీ మాట్లాడుతూ..”భారత ప్రజలు ఏమి చేయాలని ఆయన (మోడీ) ఆశిస్తున్నారో ప్రధాని వివరించారు, కాని ప్రజల కోసం తన ప్రభుత్వం ఏమి చేస్తుందో ఆయన చెప్పలేదు” అని తివారీ అన్నారు.

“పేదలకు జీవనోపాధి – వారి మనుగడను గూర్చి మోడీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, పేదలు 21 + 19 రోజులు తమను తాము రక్షించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవడంలో కేంద్రం విఫలమైందని చిదంబరం అన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంది, ఆహారం ఉంది, కాని ప్రభుత్వం డబ్బు లేదా ఆహారాన్ని విడుదల చేయదని చిదంబరం అన్నారు.