Huzurabad: హుజురాబాద్ ఉప ఎన్నిక అందరిలో అంచనాలు పెంచుతోంది. పోలింగ్ సరళి చూస్తుంటే ఎవరికి కూడా ఊహలు అందడం లేదు. తమ పార్టీకే లాభం అంటే తమకే ప్రయోజనమని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల రికార్డులు కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతి రెండు గంటలకోసారి పోలింగ్ రేటు 7.60 శాతం పెరగడం గమనార్హం. ఈ పరిస్థితి చూస్తుంటే ఎవరికి ప్రయోజనమో ఎవరికి నష్టమో అర్థం కావడం లేదని ఎన్నికల విశ్లేషకులు చెబుతున్నారు.

ఉదయం నుంచే పోలింగ్ సరళి పెరుగుతోంది. ఓటర్లు బారులు తీరుతున్నారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు 61.66 శాతం పెరగడంతో ఈ సారి ఓటింగ్ శాతం ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఓటర్లలో వచ్చిన మార్పుకు రాజకీయ పార్టీలు ఆశ్చర్యపోతున్నాయి. ఓటర్లలో ఇంత చైతన్యం ఎప్పుడు వచ్చిందో అర్థం కావడం లేదని చెబుతున్నారు.
మధ్యాహ్నం ఒంటి గంట వరకే 45 శాతం మించి ఓటింగ్ శాతం నమోదు కావడం తెలిసిందే. అన్ని మండలాల్లో పోలింగ్ సరళి పెరుగుతోంది. దీంతో సాయంత్రం ఏడు గంటల వరకు సమయం ఉండటంతో సుమారు 95 శాతం పోలింగ్ నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామంతో ఏ పార్టీకి లాభమో మాత్రం అంతుచిక్కడం లేదు. కానీ ఈ పరిణామంతో పార్టీల్లో మాత్రం ఆశలు రేకెత్తుతున్నాయి.
Also Read: EXIT Poll: ఎగ్జిట్ పోల్స్-హుజూరాబాద్ లో బీజేపీదే గెలుపు!
విజయంపై ఎవరికి వారు తమ అంచనాలు చేస్తున్నారు. ఈటలపై కోపంతోనే ఓటర్లు గులాబీ పార్టీకి ఓట్లు వేస్తున్నారని, టీఆర్ఎస్ ఆగ్రహంతోనే ఈటలకే ఓట్లు పడుతున్నాయని చెబుతున్నారు. దీంతో ఇరు పార్టీల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. విజయం తమదంటే తమదని భావిస్తున్నాయి. ఎన్నికల సంఘం కూడా క్యూలైన్లలో నిలిచిన వారికి అవకాశం కల్పిస్తామని చెప్పడంతో పోలింగ్ శాతం ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: Telugu Desam Party: ఏపీలో టీడీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది?