కొడాలి నాని సడెన్ గా సెలైంటయ్యారు.. వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న నాని ఒక్కసారిగా సైలంటవడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో కొన్నాళ్లు పని చేసి చంద్రబాబుతో విబేధించి వైసీపీలో చేరారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా చంద్రబాబును చెడుగుడు ఆడుకోవడంలో నాని తర్వాతే ఎవరైనా అనే టాక్ ఏపీలో రాజకీయాల్లో తరుచూ విన్పిస్తుంటుంది.
జగన్ సీఎం అయ్యాక కొడాలి నానికి మంత్రి పదవీ దక్కింది. మాములుగానే ఆయన ఫైర్ బ్రాండ్.. దానికితోడు మంత్రి పదవీ దక్కడంతో ఇక చంద్రబాబుపై ఓ రేంజ్లో పంచ్ డైలాగులతో విరుచుపడేవారు. వీటిలో కావాల్సినంత మసాలా ఉండేదనుకొండి.. అదేవేరే విషయం.. అయితే కొద్దిరోజులుగా నాని మౌనం పాటిస్తున్నారు. సడెన్ గా ఆయన సైలంట్ అవడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
నాన్న వైఎస్ఆర్ పై జగన్ కు ఎంత ప్రేమ ఉంది?
టీడీపీ నాయకులు సీఎం జగన్, ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు నాని దీటైన సమాధానం ఇచ్చేవారు. ప్రజావేదిక కూల్చివేత, రాజధాని రైతులు, అమరావతి ఇష్యూలో కొడాలి నాని తెలుగు తమ్ముళ్లను, ప్రధానంగా చంద్రబాబును ఓ ఆటాడుకునేవారు. కాగా కొద్దిరోజులుగా టీడీపీ నేతలు ప్రభుత్వం గట్టిగా విమర్శలు చేస్తున్న నాని మౌనంగానే ఉంటున్నారు. నిమ్మగడ్డ ఇష్యూ నుంచి కొడాలి స్పీడ్ తగ్గించారనే మాట విన్పిస్తుంది.
అయితే నాని పార్టీపై అసంతృప్తిగా ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. దీనిని నాని సన్నిహితులు ఖండిస్తున్నారు. నానికి ఎలాంటి అసంతృప్తిలేదని కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. గుడివాడలో ఆయన ప్రజా సమస్యలపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. నిత్యం సీఎం కార్యాలయానికి వస్తున్నారని ఆయన ప్రెస్ మీట్ పెట్టే స్థాయిలో టీడీపీ విమర్శలు లేవని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రత్యర్థులు కోరుకుంటున్నట్లు నాని తనస్టైల్లో కౌంటర్ ఎప్పుడిస్తారో చూడాలి..!