వ్యాయామం చేయండి.. లేకపోతే అంతేనట!

కరోనా దెబ్బతో గత ఆరేడు నెలలుగా ఇంటికే పరిమితమైన వాళ్ళు ప్రతిరోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి.  శరీరానికి వ్యాయామం లేకుంటే దాని వలన అనేక సమస్యలు వస్తాయి.  ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇంటికే పరిమితమై పనులు చేస్తున్నారు.  దీంతో శరీరం గురించిన శ్రద్ద తగ్గిపోయిందని సర్వేలు చెప్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉన్నప్పటికీ తప్పనిసరిగా కనీసం 30 నిముషాలు వ్యాయామం చేయాలనీ నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వలన శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా,  శరీరంలో వ్యాధినిరోధక శక్తి  పెరుగుతుంది.  ఫలితంగా […]

Written By: Neelambaram, Updated On : July 16, 2020 6:01 pm
Follow us on

కరోనా దెబ్బతో గత ఆరేడు నెలలుగా ఇంటికే పరిమితమైన వాళ్ళు ప్రతిరోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి.  శరీరానికి వ్యాయామం లేకుంటే దాని వలన అనేక సమస్యలు వస్తాయి.  ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇంటికే పరిమితమై పనులు చేస్తున్నారు.  దీంతో శరీరం గురించిన శ్రద్ద తగ్గిపోయిందని సర్వేలు చెప్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉన్నప్పటికీ తప్పనిసరిగా కనీసం 30 నిముషాలు వ్యాయామం చేయాలనీ నిపుణులు సూచిస్తున్నారు.

ఇలా చేయడం వలన శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా,  శరీరంలో వ్యాధినిరోధక శక్తి  పెరుగుతుంది.  ఫలితంగా కరోనా నుంచి బయటపడొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  వ్యాయామం చేయని వ్యక్తుల్లో చాలా వరకు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు.  ఊబకాయంతో పాటుగా మనిషిలో క్రమంగా మతిమరుపు కూడా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.   ఊబకాయం వలన ప్రపంచంలో ప్రతి ఏడాది 5.3 మిలియన్ మంది మరణిస్తున్నారని గణాంకాలు చెప్తున్నాయి.  ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే వ్యాయామం తప్పనిసరి చేయాల్సిందే.  ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వ్యక్తులు ప్రతిరోజూ చిన్న చిన్న వ్యాయామాలు చేయాలని  నిపుణులు సూచిస్తున్నారు.