New Tension To CM Jagan: జగన్‌కు కొత్త టెన్షన్.. జిల్లాల ఏర్పాటుతో వైసీపీలో ఇలా జరుగుతుందేంటి..

New Tension To CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతమున్న 13 జిల్లాలను 26 చేసిన విషయం తెలిసిందే. అయితే, జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. కొందరు వైసీపీ నేతలు జిల్లాల ఏర్పాటులో తమ వాదనను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.. ఆ లిస్టులో స్వయంగా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఏపీలో ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. జగన్ క్యాంప్ ఆఫీస్ తాడేప‌ల్లి […]

Written By: Mallesh, Updated On : January 28, 2022 6:10 pm
Follow us on

New Tension To CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతమున్న 13 జిల్లాలను 26 చేసిన విషయం తెలిసిందే. అయితే, జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. కొందరు వైసీపీ నేతలు జిల్లాల ఏర్పాటులో తమ వాదనను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.. ఆ లిస్టులో స్వయంగా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఏపీలో ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. జగన్ క్యాంప్ ఆఫీస్ తాడేప‌ల్లి నుంచి కొంద‌రు కీల‌క నేత‌ల‌కు ఫోన్లు వెళ్తున్నాయి. అర్ధం చేసుకోండి ఈ ఒక్కసారి అంటూ కొందరు నేతలను బుజ్జిగిస్తున్నారు. వీరంతా జిల్లాల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా వారే కావడం గమనార్హం. వాస్త‌వానికి ప్రభుత్వ నిర్ణయాలను ప్రతిపక్షాలు తప్పుబట్టాలి. కానీ ఇక్కడ రివర్స్. సొంత పార్టీ వారే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.

New Tension To CM Jagan

గుంటూరు జిల్లాలో ప‌ల్నాడు జిల్లాకు ఆ పేరు వ‌ద్దంటూ.. తొలుత‌.. ఎమ్మెల్సీ జంగా కృష్ణ‌మూర్తే డిమాండ్ చేశారు. ఈ జిల్లాకు.. మ‌హాక‌వి గుర‌జాడ అప్పారావు పేరును పెట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇక‌, ప్రకాశం జిల్లాలోని కందుకూరును రెవెన్యూ డివిజన్ గా కొనసాగించాలని కందుకూరు ఎమ్మెల్యే మానుగుం ట మహీథర్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రతిపాదించిన జిల్లాల్లో భాగంగా కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలుపుతూ ప్రతిపాదించారు. ఈ విషయమై ఆయన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Also Read: పట్టుదలకు పోతే ఉద్యోగుల పని ఖతమేనా?

కందుకూరు రెవెన్యూ డివిజన్ ఉనికిని కోల్పోతోంద‌ని అన్నారు. రాష్ట్రంలోని అతిపెద్ద రెవెన్యూ డివిజన్ ను లేకుండా చేయడం మంచిది కాదన్నారు. రెవెన్యూ డివిజన్ లో ఎన్ని మండలాలు ఉంటాయన్నది ప్రశ్న కాదని, కందుకూరు రెవెన్యూ డివిజన్ గా కొనసాగాలన్నదే తన అభిమతమన్నారు.

ఈ విషయాన్ని ఇప్పటి కే లేఖ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఇక‌, అన్న‌మ‌య్య జిల్లాఏర్పాటుపై రాయ‌చోటిలో వైసీపీ నేత‌లే అగ్గిరాజేసిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. త‌మ‌ను రాజంపేట కేంద్రం గా జిల్లా ఏర్పాటు చేయాల‌ని.. రాయ‌చోటి వ‌ద్ద‌ని తమ వాయిస్ వినిపిస్తున్నారు. కాగా, దీనిపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Also Read: కొత్త జిల్లాల ఏర్పాటు ఆలస్యమేనా? .. మరో నోటిఫికేషన్ కు సర్కారు నిర్ణయం

Tags