Tiger Attack: పశ్చిమ గోదావరి జిల్లాను పులి భయపెడుతోంది. శివారు గ్రామాల రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేసోంది. దీంతో దూడలు మృత్యువాత పడుతున్నాయి. మూడు రోజుల్లో మూడు దూడలు చనిపోవడంతో ఆందోళన కలుగుతోంది. గతంలో కూడా పులులు తిరగడంతో భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. దీంతో రైతులు అటవీ అధికారులకు సమాచారమందించారు.

ఈనెల 24న రాత్రి ద్వారకా తిరుమల మండలం గుణ్ణంపల్లిలో ఓ రైతు పొలంలో కట్టేసిన దూడను చంపి తిన్నది. ఉదయం రైతు పొలానికి వెళ్లి చూడగా దూడ కళేబరం కనిపించడంతో పులి అడుగులు గుర్తించారు. 25న నారాయణపురం శివారులో కూడా మరో దూడను చంపి తిన్నది. దీంతో పులి గురించి భయం వ్యక్తం చేస్తున్నారు. తమ పశువులను కాపాడేందుకు అటవీ అధికారులు సహకరించాలని కోరుతున్నారు.
Also Read: పట్టుదలకు పోతే ఉద్యోగుల పని ఖతమేనా?
దీంతో పులి జాడలను గుర్తించిన రైతులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళలో తిరగాలంటే జంకుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల రైతులు అప్రమత్తమయ్యారు. గుంపులుగా తిరగాలని చూస్తున్నారు. పులి భయంతో బయటకు రావాలంటేనే భయం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అటవీ అధికారులు వచ్చి క్షేత్రస్థాయిలో పాదముద్రలను కనుగొన్నారు.
పులి మనుషులపై ఎప్పుడు విరుచుకుపడుతుందో అని భయపడుతున్నారు. గతంలో కూడా అటవీ ప్రాంతాల్లో పులులు సంచరించేవని చెబుతున్నారు. మరోమారు పులి సంచారంతో ప్రజలు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. రాత్రి వేళల్లో కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. పులి భయంతో పశువులను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. అటవీ అధికారులు త్వరగా పులిని పట్టుకుని తమ భయం పోగొట్టాలని కోరుతున్నారు.
Also Read: కొత్త జిల్లాల ఏర్పాటు ఆలస్యమేనా? .. మరో నోటిఫికేషన్ కు సర్కారు నిర్ణయం