
కరోనా వేళ అందరూ హైరానా పడుతున్నారు. రక్కసి బారిన పడితే ప్రాణాలు హరీ అంటాయని భయపడుతున్నారు. ఇంత జరుగుతున్నా మన ఏపీ సీఎం మాత్రం కూల్ గా ఉన్నారు. తాడేపల్లి నుంచే తన పని కానిచ్చేస్తున్నారు. అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటున్నాయి. దీంతో ప్రజలు సమిధలవుతున్నారు. అధికార యంత్రాంగం సైతం సమస్యలను లైట్ గా తీసుకుంటున్నాయి. ఫలితంగా ఎక్కడ సత్ఫలితాలు రావడం లేదు. దీంతో జగన్ అప్రతిష్టను మూటగట్టుకుంటున్నారు. ప్రజలకు సేవ చేయడంలో విఫలమయ్యారని ప్రతిపక్షాలు సైతం దుమ్మెత్తిపోస్తున్నాయి. అయినా ఆయనలో చలనం లేకుండా పోతోందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
జగన్ అదికారులను ఫలానా పని చేయాలని ఆదేశిస్తారు. కానీ వారిపై ఆధిపత్యం చెలాయించరు. భయపెట్టరు. కరోనా వేళ కూడా జగన్ తరచూ సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు. అధికారులు సైతం మమ అనపిస్తున్నారు తప్ప ఆచరణలో కనిపించకపోవడంతో జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయ.
అధికారుల విషయంలో చంద్రబాబు వైఖరి కఠినంగా ఉంటుంది. అందుకే ఆయన పాలనలో అధికార యంత్రాంగం నిత్యం అప్రమత్తంగా ఉండేవారు. కానీ జగన్ పాలనలో అధికారుల్లో బద్దకత్వం పెరిగిపోయింది. పనులు చేయడంలో తాత్సారం వహిస్తున్నారు. దీంతో ప్రజలు మేలు జరగం లేదు. ఈ నేపథ్యంలో జగన్ తాడేపల్లి నుంచి కదిలి క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తే తప్ప ఫలితాలు రావనే విషయం బోధపడుతోంది.
కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ అందక సామాన్యులు ఊపిరి వదులుతున్నారు. మంత్రులు సైతం తమ ఇళ్లను వదలి రావడం లేదు. దీంతో కరోనా బాధితులకు సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఎమ్మెల్యేలు కూడా బయటకు రావడం లేదు. ప్రభుత్వ యంత్రాంగం సరిగా పనిచేయడం లేదు. దీంతో జగన్ కు పరిపాలన అంటే తెలియదని మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు చేస్తున్నారు.+