
దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. గురువారం పెట్రోల్ ధరపై 25 పైసలు, డీజిల్ పై 32 పైసల పెరుగుదల నమోదైంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ. 100కు చేరువలో ఉంది. అక్కడ లీటరు పెట్రోల్ ప్రస్తుతం రూ. 99.94, డీజిల్ ధర లీటరుకు 91.87 పెరిగినట్లు ప్రభుత్వ రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రేటు లీటరుకు రూ. 93.68, డీజిల్ ధర 84.61 కు పెరిగింది. మే 4 నుంచి పెట్రోల్, డీజల్ ధరలు పెరగడం ఇది పద్నాలుగోసారి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ. 97.52, డీజిల్ రూ.92.39 గా ఉంది.