Chandrababu: శకునం చెప్పే బల్లే కుడిదిలో పడిందట. అపర చాణక్యుడిగా పేరుపొందిన రాజకీయ నేత చంద్రబాబు నాయుడు వ్యూహాలు పనిచేయడం లేదు. ఫలితంగా ఆయన అనుకున్నది సాధించలేకపోతున్నారు. అధికారానికి దూరమవుతున్నారు. ప్రతిపక్ష నేతగానే మిగిలిపోతున్నారు. అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అన్నట్లుగా ఆయన తీరుతోనే అపార్థాలు వస్తున్నాయి. నేతల్లో అసహనం పెరిగిపోతోంది ఏకపక్ష నిర్ణయాలు నేతలను పార్టీకి దూరం చేస్తున్నాయి. ఫలితంగా అధికారం ఆమడదూరంలోనే మిగిలిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దిద్దుబాటు చర్యలు చేపట్టినా అవి ఏ మేరకు ఫలితాలు ఇస్తాయో తెలియడం లేదు.

రాష్ర్టంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. రోజుకో రకంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరో పక్క వైసీపీ దూసుకుపోతోంది. దానికి కళ్లెం వేయాలంటే ఇంకా పదునైన వ్యూహాలు అవసరం. చంద్రబాబుకు వయోభారం కూడా వేధిస్తోంది. అందరికంటే పెద్దవాడు కావడంతో ఆలోచనలు కూడా గతి తప్పుతున్నాయి. గతంలో ఆయన వేసిన ఏ అడుగు కూడా వెనుకకు రాలేదు కానీ ప్రస్తుతం ఒక్క అడుగు కూడా ముందుకు పోవడం లేదు. దీంతో రాజకీయాల్లో మరింత రాటు దేలాల్సిన నేత చంద్రబాబుకు తోడు కావాల్సిన అవసరం ఏర్పడంది. లోకేష్ కు అంతటి ప్రావీణ్యం లేకపోవడంతోనే ఆయనకు ఈ తిప్పలు.
Also Read: యూపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న కేటీఆర్.. అఖిలేశ్‌కు మద్దతుగా ప్రచారం..?
ప్రస్తుతం రాష్ర్టంలో కుల రాజకీయాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. అయితే గతంలో బీసీ నేత ముద్రగడ పద్మనాభంతో చంద్రబాబుకు ఉన్న విభేదాలతో ఆయన కొత్త పార్టీ పెడతారనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో చంద్రబాబుకు భయం పట్టుకుంది. కాపుల ఓట్లు చీలిపోతే మెజార్టీ రావడం కష్టమే. అందుకే ఆయనకు ముద్రగడ నిర్ణయం నిద్రపట్టకుండా చేస్తోంది. ఈ క్రమంలో ఆయనను మచ్చిక చేసుకుందామనుకున్నా ఆయన బాబు మాట వినే స్థితిలో లేరు. సొంత కుంపటి పెట్టడానికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
గతంలో బాబు కాపులను ఈబీసీ కోటాలో చేర్చారు. తమ కులం ఆర్థికంగా బలమైనది లేదని చెబుతున్నా బాబు పట్టించుకోలేదు. దీంతో సహజంగానే కాపులకు కోపం వచ్చింది. ఫలితంగా బాబుకు అధికారం దూరం చేశారు. ప్రస్తుతం బాబు పవన్ కల్యాణ్ తో జతకట్టాలని చూస్తున్నా అన్న చిరంజీవి జగన్ తో భేటీ కావడంతో కాపుల ఓట్లు జగన్ కే పోతాయోమననే బెంగ పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకున్నా కలిసొస్తుందా లేదా అనేది సందేహమే.
బీసీ ఓట్లతోనే బలం పెరుగుతుందని భావిస్తున్న చంద్రబాబుకు మాత్రం అటు ముద్రగడ పద్మనాభం, ఇటు చిరంజీవి నిద్రపట్టనివ్వడం లేదు. భవిష్యత్ లో టీడీపీ అధికారానికి రాకుండా వీరే అడ్డు తగలనున్నారని బాబు బాధ. మొత్తానికి రాష్ర్టంలో జరుగుతున్న పరిణామాల్లో చంద్రబాబుకు మాత్రం సమస్య వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి మరోవైపు బీజేపీ కూడా చంద్రబాబును విశ్వసించడం లేదు. అవసరమైన సమయంలో చంద్రబాబు దెబ్బకొట్టడంతో బీజేపీ చంద్రబాబు కంటే జగనే నయం అనే కోణంలో ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. దీంతో చంద్రబాబుకు చిక్కులే ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
Also Read: ఏపీలో స్కూళ్ల సెలవులపై ప్రభుత్వం కీలక ప్రకటన