Subbareddy: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ టికెట్ వైసీపీ ఇవ్వబోతున్నదని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని, అటువంటి వార్తలు నమ్మొద్దని చిరంజీవి కోరారు. అంతటితో కథ ముగిసింది. కానీ, టీటీడీ చైర్మన్, వైసీపీ అధినేత జగన్ బాబాయ్ సుబ్బారెడ్డి చేసిన కామెంట్స్ ప్రజెంట్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమవుతున్నాయి.

ఎవరినో తీసుకొచ్చి రాజ్యసభ సీటు ఇవ్వాల్సిన అవసరం లేదని, పార్టీ కోసమే పని చేసిన వారికి మాత్రమే జగన్ ఆ సీటు ఇస్తారని సుబ్బారెడ్డి అన్నారు. దాంతో వైసీపీలో రివర్స్ అటాక్ స్టార్ట్ అయింది. సుబ్బారెడ్డి అటువంటి వ్యాఖ్యలు చేయడంలో ఆయనకూ ఇంట్రెస్ట్ ఉందనే సంగతి అర్థమవుతున్నదని అంటున్నారు.
Also Read: మీతో మిమ్మల్ని కూర్చోబెడతారు.. పూరి కొత్త పాఠం !
గతంలోనూ సుబ్బారెడ్డి రాజ్య సభ సీటు ఆశించారని, కానీ, జగన్ ఆయనకు నామినేటెడ్ పోస్టు ఇచ్చి సరిపెడుతున్నార. కాగా, ఈ సారి టీటీడీ చైర్మన్‌తో పాటు రాజ్యసభ సీటు కూడా ఇవ్వాలని జగన్‌ను సుబ్బారెడ్డి కోరుతున్నారు. కానీ, ఆ విషయమై ఇంకా స్పష్టత రావడం లేదు. ఇకపోతే పార్టీ కోసం తాను కష్టపడుతున్నానని చెప్పకనే సుబ్బారెడ్డి చెప్తున్నారని అర్థమవుతోంది.
ఈ క్రమంలోనే వైసీపీ కోసం ఎప్పుడూ పని చేయని పరిమళ్ నత్వానీకి రాజ్య సభ సీటు ఎందుకు ఇచ్చారనే ప్రశ్న వైసీపీ నేతల ముందర ఉంది. అలా రాజకీయ అవసరాల కోసమే జగన్ రాజ్యసభ సీట్లు కేటాయిస్తారన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే, సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు సమర్థించుకోవడానికి మాత్రమే పని చేస్తాయని, రియాలిటీలో సరిపోవని కొందరు వివరిస్తున్నారు. వైసీపీలో నేతల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ జగన్ నిర్ణయంతో అందరూ ఏకీ భవిస్తారని చెప్పేందుకు పని కొస్తాయని అంటున్నారు. ఇకపోతే గత కొంత కాలం నుంచి ఏపీ కేబినెట్ విస్తరణ గురించి వైసీపీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కానీ, ఆ విషయం ఇంకా తేలడం లేదు. త్వరలో ఏపీ మంత్రి వర్గవిస్తరణ ఉండబోతున్నదని గత కొంత కాలం నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి.కానీ, ఇంత వరకు ఆ విషయం ఎటూ తేలడం లేదు.
Also Read: పీకే ఎంట్రీకి ముందే మొదలు పెట్టేశారా?