Prashanth Kishore Congress: ‘మాటా ముచ్చట.. ముగిసింది.. నిశ్చితార్థమూ పూర్తయ్యింది… ఇక పెళ్లే మిగిలింది… ముహూర్తం పెట్టేందుకు పెద్దలంతా సమావేశమయ్యారు’ ఇంతలోనే ఊహించని షాక్. నాకు ఈ పెళ్లే ఇష్టం లేదని పెళ్లి కూతురు కామెంట్.. అచ్చం ఇలాగే ఉంది కాంగ్రెస్‌కు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన షాక్! పెళ్లి పీటలమీదికి ఎక్కక ముందే విడాకులు ప్రకటించారు పీకే.
Sonia Gandhi Prashanth Kishor
దేశంలో విజయవంతమైన ఎన్నికల వ్యూహకర్తగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నాడంటూ గత కొద్ది కాలంగా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ వార్త నిజమేనా అని కొందరు ఆశ్చర్యపోయారు. లేవడానికి కూడా ఓపిక లేని స్థితిలో చతికిలపడిపోయిన కాంగ్రెసులో అంత పెద్ద వ్యూహ నిపుణుడు చేరడమేమిటా అని సర్వత్రా చర్చనీయాంశమైంది. కానీ ఆ వార్తల్ని తిప్పి కొడుతూ ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరబోవట్లేదని ట్వీట్ చేశారు.
-బంధం తెగిపోవడానికి కారణాలివే..
1. కాంగ్రెస్ పార్టీలో గణనీయమైన మార్పుల్ని తీసుకురావాలని ప్రశాంత్ కిశోర్ సూచించినట్టు, ఆ మార్పుల విషయంలో తనకు పూర్తిగా ఫ్రీ హ్యాండ్ కోరినట్టు తెలుస్తోంది. అయితే దానికి హై కమాండ్ ఒప్పుకోకుండా ప్రశాంత్‌ని కేవలం ఎన్నికల వ్యూహ రచనకే పరిమితం చేశారని టాక్. అందుకే కాంగ్రెస్ కు పీకే గుడ్ బై చెప్పినట్లు సమాచారం.
2. సోనియా, ప్రియాంక, రాబర్ట్ వాద్రా తమ మద్దతుని ప్రశాంత్ కిషోర్‌కు ఇవ్వగా, రాహుల్‌గాంధీ మాత్రం సమ్మతించలేదని సమాచారం.
3. గత 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీకి సారధ్యం వహించి వ్యూహరచన చేసిన ప్రశాంత్ కిశోర్ పై ఎంత వరకు విశ్వాసం చూపించాలో తెలియని పరిస్థితి కాంగ్రెస్ నాయకత్వానికి ఎదురైంది.పైగా తమ విరోధులైన కొన్ని ప్రాంతీయపార్టీలకు ఆయన వ్యూహకర్తగా ఉండడాన్ని కాంగ్రెస్ సహించలేకపోయిందట..
Also Read: F3 Movie Song: ‘ఊ ఆ అహ అహ’తో ఊపు తెచ్చిన ‘ఎఫ్ 3’
4. కాంగ్రెస్ సీనియర్ నాయకులకు మార్పుల పట్ల సుముఖత లేదు. ప్రశాంత్ సారధ్యంలోని మార్పులు తమ ఉనికిని ప్రశ్నార్థకంలో నెడతాయని సీనియర్లు భావించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నాయకత్వం కూడా ఈ విషయంలో కంగారుపడిన మాట వాస్తవం.
5. ప్రశాంత్ కిషోర్ గతంలో నెలకొల్పిన ఐపాక్ కంపెనీ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల వ్యూహరచన చేస్తోంది. అయితే ఆ కంపెనీకి తనకి ఇప్పుడు సంబంధం లేదని చెప్పడంపై కాంగ్రెస్ పార్టీకి నమ్మకం కలగలేదు.
-పదవీ లేదు.. పైసా రాదనే..
ఒక పార్టీకి రాజకీయ వ్యూహాలు రచించేందుకు కోట్ల రూపాయలు తీసుకునే ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరాలనుకోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది. అయితే రాజకీయంగా ఆయన ఏదో ఉన్నతమైప పదవి ఆశించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పొలిటికల్ గ్రౌండ్లో ప్రచారం జరిగింది. అందరూ ఊహించినట్లుగానే ఆయన కాంగ్రెస్‌లో ఉన్నత పదవే ఆశించారు. ఉపాధ్యక్ష పదవితోపాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం ఏర్పాటు చేసే ఎంపవర్మెంట్ కమిటీ సారథ్య బాధ్యతలు ఆశించారు. అంతా తాను చెప్పినట్లే వినాలని కండీషన్ పెట్టినట్లు సమాచారం. ఆర్థికంగా ఎలాంటి లాభం ఆలోచించకుండా జాతీయ పార్టీకి వ్యూహరచన చేయనున్న నేపథ్యంలో తన నిర్ణయమే ఫైనల్ కావాలని, కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని హింట్ ఇచ్చారు. పార్టీలో సంస్థాగత మార్పులపైనా సూచనలు చేశారు. ప్రశాంత్ కిషోర్ ఆశించిన కాంగ్రెస్ పగ్గాలు పూర్తిగా దక్కలేదు. అయితే తన సారథ్యంలోని ఐపాక్ సంస్థ దేశంలో వివిధ పార్టీలతో ఒప్పందం చేసుకుని.. తాను మాత్రం కాంగ్రెస్‌లో చేరతాననడంపై కాంగ్రెస్‌లో చాలా మంది వ్యతిరేకించారు.మూడు రోజుల క్రితం పార్టీ ప్రతినిధులతో సోనియాగాందీ పార్టీలో ప్రశాంత్ కిశోర్ చేరికపై నిర్వహించిన సమావేశంలో ఈ అంశాలపైనే చర్చించారు. పీకే కండీషన్లకు రాహుల్‌గాంధీ అంగీకరించలేదు. మరోవైపు ఆయనపై చాలామంది ప్రతినిధులు విశ్వాసం వ్యక్తం చేయలేదు. తాను వేరు, ఐపాక్ వేరు అంటూ పీకే చేసిన ప్రకటనపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ సమావేశంలో చర్చించిన అంశాలు పీకేకు లీక్ కావడంతో ఇలాంటి అనేకమైన అపనమ్మకాలు, అనుమానాలు ఉన్న కాంగ్రెస్‌లో చేరకపోవడమే నయమని భావించారు. వ్యూహాత్మకంగా కాంగ్రెస్ తిరస్కరణ ప్రకటన కంటే ముందే తానే కాంగ్రెస్ ఆహ్వానం తిరస్కరించినట్లు ట్వీట్ చేసి.. 130 ఏళ్ల చరిత్రగల జాతీయ పార్టీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు పీకే. పర్యవసానంగా ఆయన కాంగ్రేసులో చేరలేదు. ఈ పదవి, పైసా… ఇదీ పీకే స్ట్రాటజీ.. కాంగ్రెస్‌తో తెగదెంపులకు అదే కారణం!
ఇలాంటి అనేకమైన అపనమ్మకాలు, అనుమానాలు వ్యక్తమవడంతో ప్రశాంత్ కిషోర్ కు కాంగ్రెస్ పగ్గాలు పూర్తిగా దక్కలేదు. పర్యవసానంగా ఆయన కాంగ్రేసులో చేరలేదు.
Also Read: RRR Movie Etthara Jenda Song: వైరల్ అవుతున్న ‘ఎత్తర జెండా’.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ !
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: What actually happened between prashant kishore and the congress
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com