Delhi Assembly Elections 2025 : రెండు రోజుల్లో ఢిల్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గత మూడు దఫాల్లో అరవింద్ కేజ్రీవాల్ కు 50 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. వార్ వన్ సైడ్ అయ్యింది. కానీ ఈసారి వార్ వన్ సైడ్ గా లేదని అందరూ చెబుతున్నారు.
ముందుగా అరవింద్ కేజ్రీవాల్ కు అడ్వంటేజ్ గా ఉమెన్ ఓటర్లు ఉన్నారట.. ఫ్రీ బస్ సహా పథకాలు ఆమ్ ఆద్మీకి మహిళలను చేరువ చేశాయి. మొహల్లా క్లినిక్ లు బాగా ఉపయోగపడ్డాయి. మూడోది బెటర్ ప్రభుత్వ స్కూల్స్ ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చాయి. మిడిల్ క్లాస్ లో కూడా అరవింద్ కేజ్రీవాల్ కు కన్సిడరబుల్ సెక్షన్ గా మారింది.
లిక్కర్ స్కాం అరవింద్ కేజ్రీవాల్ కు డ్యామేజ్ చేసింది. అధ్వాన్న రోడ్లు ఢిల్లీలో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చింది. మూడోది ఎయిర్ పొల్యూషన్ .. రివర్ పొల్యూషన్.. ఇవన్నీ మధ్యతరగతిలో బాగా పట్టుకున్నాయి. మూడు సార్లు గెలవడంతో ఈసారి వ్యతిరేకత వచ్చింది. మధ్యతరగతి వారు అరవింద్ కేజ్రీవాల్ కు దూరమైంది.
ఉత్కంఠగా మారిన ఢిల్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.