Journalist Vijaya Reddy vs Congress : తెలంగాణలో భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోయిన తర్వాత.. ఆ పార్టీ సోషల్ మీడియా మీద ప్రధానంగా ఫోకస్ చేసింది. 30 మెడికల్ కాలేజీలు కట్టే దానికంటే 30 యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకొని ఉంటే అధికారంలోకి వచ్చేవారమని కేటీఆర్ పదేపదే చెప్పారు.. దానిని అమల్లోపెట్టి చూపిస్తున్నారు. యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్, కుకూ, త్రెడ్స్, స్నాప్ చాట్.. ఇలా అన్నీ సోషల్ మీడియా వేదికలలో గులాబీ పార్టీకి అనుకూలంగా గ్రూపులను తయారు చేశారు. యూ ట్యూబ్ చానల్స్ ను హైర్ చేసుకున్నారు. దానికి తగ్గట్టుగానే కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులు గులాబీ స్తోత్రం చదువుతున్నారు. గులాబీ పార్టీ నాయకుల కంటే ఎక్కువ రెచ్చిపోతున్నారు. ఆ జాబితాలో జర్నలిస్ట్ అని చెప్పుకునే విజయారెడ్డి ఉన్నారని” కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే విజయా రెడ్డి కి కాంగ్రెస్ నాయకులకు ప్రతిరోజు సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఒకరి తప్పులు మరొకరు ఎత్తి చూపుకుంటూ ఉంటారు. ఒకరి బండారాలను మరొకరు వీడియోల రూపంలో ప్రదర్శిస్తూ ఉంటారు. న్యూట్రల్ గా ఉండే వారికి ఇవి భలే ఆనందాన్ని ఇస్తాయి. అందువల్లే ట్విట్టర్లో విజయా రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ నాయకుల యుద్ధాన్ని నెటిజన్లు భలే ఎంజాయ్ చేస్తుంటారు.
విజయా రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ నాయకులు
విజయా రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో ఇటీవల ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో తనను కాంగ్రెస్ నాయకులు ఎలా విమర్శిస్తున్నారో ఓ వీడియో రూపంలో విజయా రెడ్డి పోస్ట్ చేశారు..” మీ బాధ ఏందిరా నాయనా” అంటూ ఆమె మండిపడ్డారు. అయితే ఆ వీడియోలో కాంగ్రెస్ నాయకులు విజయారెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శించారు..”ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో కేసి వేణుగోపాల్ ను కలిసింది.. ఎక్కడ ఆర్టీసీ బస్సులో జరిగిన మహిళల గొడవను.. ఇప్పుడు జరుగుతున్నట్టుగా చూపించింది.. ఇంకా అనేక సత్య దూరమైన విషయాలను రేవంత్ పరిపాలన కాలంలో జరుగుతున్నట్టుగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈమె ఇలా చేయకపోతే కేటీఆర్ నుంచి డబ్బులు రావు. పైగా ఆ వీడియోలు పాతవి అయినప్పటికీ.. ప్రస్తుత ప్రభుత్వానికి ఆపాదించడం ఆమె ఎర్నలిజానికి ప్రతీక. పైగా ఈమె జర్నలిస్ట్ అని చెప్పుకుంటుంది. ఇలాంటివారు పాత్రికేయులు ఎలా అవుతారు. అసలు పాత్రికేయమంటే వీరికి తెలుసా” అంటూ కాంగ్రెస్ నాయకులు ఆ వీడియోలో విజయారెడ్డిపై ధ్వజమెత్తారు. అయితే ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన విజయారెడ్డిపై అదే స్థాయిలో కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. “అసలు నువ్వు జర్నలిస్టువు ఎలా అవుతావ్.. నీకు పాత్రికేయమంటే తెలియదు తెలియదు. పాత్రికేయం విలువలు అంటే తెలియదు..నువ్వు జర్నలిస్టువని చెప్పుకోకు” అంటూ ఎదురుదాడికి దిగారు. అయినప్పటికీ విజయా రెడ్డి తన ధోరణి మార్చుకోవడం లేదు. కాంగ్రెస్ నాయకులు కూడా ఊరుకోవడం లేదు. చూడబోతే భారత రాష్ట్ర సమితి నాయకుల కంటే.. విజయారెడ్డి లాంటి వారిపైనే కాంగ్రెస్ నాయకులు దృష్టి సారించి విమర్శలు చేస్తూ ఉండడం విశేషం. విజయా రెడ్డి లాంటి వాళ్లు కూడా అలానే ప్రవర్తిస్తుండడం గమనార్హం.
మీ బాధ ఎంది రా నాయనా..
ఫోకస్ నా మీద కాదు ప్రజల మీద పెట్టండి ..Note: ఎడిటింగ్ టైం వేస్ట్ చేసుకోకండి ✊ pic.twitter.com/JHHc3LGV28
— Journalist Vijaya Reddy (@VijayaReddy_R) February 13, 2025