BRS Vs Congress: నేను కొడితే మామూలుగా ఉండదు.. ఇటీవల కేసీఆర్(KCR) చేసిన వ్యాఖ్య ఇది. రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సర్కాన్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలివీ. కానీ రేవంత్‌రెడ్డి కూడా కొడితే గట్టిగానే కొడతాడు అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులుకొత్తడం మీకు తెలుసు.. కానీ మేం కొడితే మామూలుగా ఉండదు.. ఇది ఓ సినిమాలో డైలాగ్. ఇక నేను కొడితే మామూలుగా ఉండదు.. ఇది ఇటీవల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవీ.
తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి దెబ్బ ఎలా ఉంటుంది అన్న చర్చ కాంగ్రెస్(Congress) వర్గాల్లో జరుగుతోంది. కొట్టడం మీకు మాత్రమే కాదు.. మాకూ తెలుసు అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. రేవంత్ కొట్టిన దెబ్బతోనే బీఆర్‌ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైందని అంటున్నారు. ఇక మళ్లీ దెబ్బకొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొంటున్నారు. ఏడాదిగా మంత్రివర్గ విస్తరణపై రేవంత్ సైలెంట్‌గా ఉంది బీఆర్‌ఎస్‌ను దెబ్బతీసేందుకే అని సంకేతాలు ఇస్తున్నాయి. ఎవరెన్ని విమర్శలు చేసినా వ్యూహంలో భాగంగానే రేవంత్ ప్లాన్ వేరే ఉందని పేర్కొంటున్నారు. నేను కొడితే మామూలుగా ఉండదు అన్న కేసీఆర్‌కు.. తన దెబ్బ సూచించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈమేరకు బీఆర్‌ఎస్ ఎల్పీ విలీనంపై హస్తం నేతలు కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎసల్ ఎల్పీ విలీనం..
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్య తీసుకోవడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌషిక్‌రెడ్డి(Padi Koushikreddy) ఇటీవలే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. త్వరగా తగిన సమయం గురించి తేల్చాలని సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేసింది. లేదంటే మేమే నిర్ణయిస్తామని వ్యాఖ్యానించింది. ఈ తరుణంలో రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకందగా పావులు కదుపుతున్నారు. బీఆర్‌ఎస్ దూకుడు తగ్గించేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఉత్సాహం ఇచ్చేలా రేవంత్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్(BRS) విలీనానికి వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. నగరానికి చెందిన ఓ మాజీ మంత్రితో ఈమేరకు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఏకంగా 16 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేలా ప్లాన్ చేస్తున్నారని సమాచానం. దీంతో బీఆర్‌ఎస్ ఎల్పీ విలీనం జరుగుతుందని తెలుస్తోంది.
ప్రతీకారంలో భాగమే..
2018లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లోకి తీసుకుని కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు కేసీఆర్. దీనికి ప్రతీకారంగానే ఇప్పుడు రేవంత్ కూడా ప్రతీకారం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. సరైన సమయంలో బీఆర్‌ఎస్‌ను దెబ్బతీసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌కు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. దీంతో సుప్రీం కోర్టు తీర్పుతోపాటు పార్టీ మారిన ఎమ్మెల్యేకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.