Delhi election 2025 results: అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉంది. ఆ పార్టీ అభ్యర్థులు దాదాపు అన్నిచోట్ల వెనుకబడి ఉన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ హస్తినను ఏలింది. ఇప్పుడు మాత్రం దారుణంగా మారింది.. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు హవా సాగించింది. దాదాపు 15 సంవత్సరాలు అక్కడ ఏక చక్రాధిపత్యంగా పరిపాలన సాగించింది.. బ్రహ్మ ప్రకాష్ 1952 -1955, షీలా దీక్షిత్ 2003 -2008, 2008 -2013 కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రులుగా పని చేశారు. పదేళ్ల క్రితం వరకు కూడా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెత్తనాన్ని చెలాయించింది.. 2013 నుంచి కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో బ్యాడ్ టైం మొదలైంది. ఆమ్ ఆద్మీ పార్టీ రంగంలోకి దిగడంతో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా పట్టును కోల్పోవడం మొదలు పెట్టింది. రోజురోజుకు ఆ పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ 0 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. అయితే ఈసారైనా పుంకుకుంటుంది.. పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది అనుకుంటే.. అంతకంతకు దిగజారి పోతోంది. ఈసారి కూడా సున్నా సీట్లకే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఓటర్లు ఎందుకు పట్టించుకోలేదు
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి చేతులు ఎత్తేయడంతో క్యాడర్ మొత్తం నిరాశలో మునిగిపోయింది. పోటీ చేసిన అన్ని స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వెనుకబడి ఉన్నారు. కనీసం కాంగ్రెస్ పార్టీకి ఒక స్థానం కూడా లభించేలాగా కనిపించడం లేదు. ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో లేరు. మరోవైపు బిజెపి నాయకులు తమ హవాను కొనసాగిస్తున్నారు. ఏకంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 50 స్థానాలు గెలుచుకునే దిశగా పరుగులు పెడుతున్నారు. ఇక అధికార ఆప్ బిజెపికి గట్టి పోటీ ఇస్తోంది. కాంగ్రెస్ మాత్రం పోటీలో లేకపోవడం విశేషం. ముచ్చటగా మూడోసారి 0 సీట్లు సాధించే దిశగా పరుగులు పెడుతున్న తీరు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ రాజ్యాన్ని ఎదురనేది లేకుండా ఏలింది. దర్జాగా పరిపాలన సాగించింది. కానీ ఇప్పుడు ఆ పార్టీని ఢిల్లీ ఓటర్లు పట్టించుకోవడం లేదు.. రాహుల్ గాంధీ ప్రచార చేసినప్పటికీ ఆ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయలేదు.. వరుసగా మూడోసారి సున్నా సీట్లకు పరిమితం కావడం పట్ల కాంగ్రెస్ పార్టీపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..” ఇది దారుణం.. ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు. పార్టీ దారుణంగా విఫలమైంది. వరుసగా మూడోసారి కూడా 0 సీట్లు వచ్చాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని” రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ పరంగా కార్యక్రమాలు చేపట్టలేకపోవడం.. ప్రజల మనసును ఆకట్టుకునే విధంగా ప్రణాళికలు రూపొందించలేకపోవడం.. క్షేత్రస్థాయిలో బలమైన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీ వరుసగా విఫలమవుతోందని.. ఢిల్లీ ఎన్నికల్లో కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.