https://oktelugu.com/

మీడియా సంస్థల మధ్య ముదురుతున్న వార్!

అప్పుడెప్పుడో సాక్షి, ఈనాడుల మధ్య మీడియా వార్ జరిగింది. సాక్షి టీవీ, రామోజీరావుపై వరస కథనాలను ప్రసారం చేసింది. ఇప్పటి వరకూ ఇలాంటి వివాదాలు ఛానల్స్ యాజమాన్యాల మధ్య రాలేదు. తాజాగా టీవీ 5, ఎన్టీవీ ల మధ్య వార్ బాగా ముదురుతోంది. రాజకీయ పార్టీ పక్షాన నిలబడే ఈ మీడియా సంస్థలు ఇప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నాయి. టీవీ 5 అధినేత నాయుడు అవినీతిపై వరస కథనాలను ప్రసారం చేస్తున్నామంటూ ఎన్టీవీ ఇప్పుడు ప్రోమోలను […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 22, 2020 / 02:20 PM IST
    Follow us on

    అప్పుడెప్పుడో సాక్షి, ఈనాడుల మధ్య మీడియా వార్ జరిగింది. సాక్షి టీవీ, రామోజీరావుపై వరస కథనాలను ప్రసారం చేసింది. ఇప్పటి వరకూ ఇలాంటి వివాదాలు ఛానల్స్ యాజమాన్యాల మధ్య రాలేదు. తాజాగా టీవీ 5, ఎన్టీవీ ల మధ్య వార్ బాగా ముదురుతోంది. రాజకీయ పార్టీ పక్షాన నిలబడే ఈ మీడియా సంస్థలు ఇప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నాయి. టీవీ 5 అధినేత నాయుడు అవినీతిపై వరస కథనాలను ప్రసారం చేస్తున్నామంటూ ఎన్టీవీ ఇప్పుడు ప్రోమోలను విడుదల చేసింది. టీవీ 5 యాజమాన్యం రియల్ దందాలతో పాటు దాని యాజమాన్యం తయారు చేసే మోకాలినొప్పుల బామ్ లలో కూడా అవినీతి, బోగస్ అంటూ ఎన్టీవీ కథనాలను ప్రసారం చేస్తున్నట్లు ప్రోమో విడుదల చేసింది. ఒక నాయుడు వంద లీలల పేరుతో వరస కథనాలను ప్రసారం చేయడానికి రెడీ అయింది.

    Also Read : వారంతా అయిపోయారు ఇప్పుడు వీళ్ళొచ్చారు..! ఎవరి తలరాత మార్చడానికి?

    నిజానికి టీవీ5, ఎన్టీవీ యజమానులిద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారే. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో ఈ ఇద్దరికి ఎటువంటి విభేదాలు లేవు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చే సరికి ఎన్టీవీ కొంత ప్రోగా ప్రభుత్వంవైపు ఉందన్న విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో టీవీ 5 ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిత్యం వరస కథనాలను వండి వారస్తుంది. ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో టీవీ 5 యాజమాన్యం టీడీపీ స్టాండ్ తీసుకుంది.

    టీవీ 5 యాజమాన్యంపై ఏపీ ప్రభుత్వం కేసులు కూడా నమోదు చేసింది. హైకోర్టు నుంచి యాజమాన్యానికి ఊరట లభించింది. అయితే రెండు ఛానల్స్ యాజమాన్యాల మధ్య ప్రభుత్వ వైఖరే వివాదాలకు కారణమని చెబుతున్నారు. గతంలో సాక్షి టీవీ రామోజీరావుపై వరస కథనాలను ప్రసారం చేసింది. ఇప్పటి వరకూ ఇలాంటి వివాదాలు ఛానల్స్ యాజమాన్యాల మధ్య రాలేదు. ఎన్టీవీ లో వస్తున్న ప్రోమోలను చూస్తుంటే టీవీ 5 యాజమాన్యాన్ని గట్టిగానే ఎటాక్ చేసేటట్లే కనపడుతుంది. మరి ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది.

    Also Read : నారా లోకేష్.. గెలుపు పొందేవరకు అలుపు లేదట!