శ్రీశైలంలో ప్రమాదం.. సాగర్ లో అలజడి!

  శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. పవర్ ప్యానెల్‌ లో చెలరేగిన మంటలతో ఈ పెను విపత్తు సంభవించింది. ఫలితంగా 900 మెగావాట్లల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ పవర్ ప్లాంట్ మొత్తం దగ్ధమైపోయింది. శ్రీశైలం పవర్ ప్రాజెక్టులో జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో నాగార్జునసాగర్‌ జలవిద్యుత్తు కేంద్రం భద్రతపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంటోంది. ఇప్పటికే రెండుసార్లు ఇక్కడ షార్ట్‌ […]

Written By: Neelambaram, Updated On : August 22, 2020 2:06 pm
Follow us on

 

శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. పవర్ ప్యానెల్‌ లో చెలరేగిన మంటలతో ఈ పెను విపత్తు సంభవించింది. ఫలితంగా 900 మెగావాట్లల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ పవర్ ప్లాంట్ మొత్తం దగ్ధమైపోయింది. శ్రీశైలం పవర్ ప్రాజెక్టులో జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో నాగార్జునసాగర్‌ జలవిద్యుత్తు కేంద్రం భద్రతపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంటోంది. ఇప్పటికే రెండుసార్లు ఇక్కడ షార్ట్‌ సర్క్యూట్‌ కాగా, ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు.

Also Read : సెటైర్ : దెబ్బకు హరీష్ రావు పాలు అమ్ముతున్నాడు… కేటీఆర్ ఆ మజాకా?

శ్రీశైలం తరహా ప్రమాదమే నాగార్జునసాగర్‌ కేంద్రంలో జరిగితే ఆస్తి నష్టం అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2017 ఫిబ్రవరిలో, 2018 ఫిబ్రవరిలో షార్ట్‌ సర్క్యూట్‌ తో టర్బైన్‌ కాలిపోయింది. 2014 ఓ టర్బైన్‌ పూర్తిగా కాలిపోయింది. సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో ప్రాణనష్టం తప్పింది.

ఈ ప్లాంట్‌ లో ప్రతి షిఫ్టులో డీఈ, ఏడీఈ, నలుగురు ఏఈలు, మరో నలుగురు సిబ్బంది విధులు నిర్వహిస్తారు. అనుకోని ప్రమాదం సంభవిస్తే.. ఉద్యోగులు తప్పించుకోవడానికి ఎమర్జెన్సీ గేట్లను ఏర్పాటు చేయాలి. అంబులెన్స్‌ ఉండాలి. ఇవేమీ లేకపోవడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని వారు ప్రాధేయపడుతున్నారు.

Also Read : తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ఎప్పటినుండో?