https://oktelugu.com/

అందుకే ఆ మూడు దేశాలలో అన్ని కేసులు?

కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రత పట్ల అమెరికా, బ్రెజిల్‌, భారత్ దేశాలు స్పందించిన తీరులో తేడాలు ఉండవచ్చు. కానీ ఫలితం మాత్రం ఒకే విధంగా ఉంది. వ్యాధి సోకిన పాజిటివ్‌ కేసులు ఈ మూడు దేశాల్లో మిలియన్ల సంఖ్యలో ఉన్నాయి. ఐదు మిలియన్ల కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉంటే, మూడు మిలియన్లకు పైగా కేసులతో బ్రెజిల్‌ రెండవ స్థానంలో, రెండు మిలియన్ల కు పైగా కేసులతో భారతదేశం మూడవ స్థానంలో ఉన్నాయి. అంటే ఈ దేశాల […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 22, 2020 8:46 pm
    Follow us on

    Modi, Trump, bolsanaro

    కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రత పట్ల అమెరికా, బ్రెజిల్‌, భారత్ దేశాలు స్పందించిన తీరులో తేడాలు ఉండవచ్చు. కానీ ఫలితం మాత్రం ఒకే విధంగా ఉంది. వ్యాధి సోకిన పాజిటివ్‌ కేసులు ఈ మూడు దేశాల్లో మిలియన్ల సంఖ్యలో ఉన్నాయి. ఐదు మిలియన్ల కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉంటే, మూడు మిలియన్లకు పైగా కేసులతో బ్రెజిల్‌ రెండవ స్థానంలో, రెండు మిలియన్ల కు పైగా కేసులతో భారతదేశం మూడవ స్థానంలో ఉన్నాయి. అంటే ఈ దేశాల నాయకులు నిర్వర్తించాల్సిన బాధ్యత చాలా వుంది. అహంభావ ప్రదర్శనలో, బడాయి పోవడంలో, విమర్శను తిరస్కరించడంలో ట్రంప్‌, బోల్సనారో, మోడీలు సుప్రసిద్ధులు. పాక్షిక మత భక్తులను ఆకర్షించగలిగే, ద్వంద్వ వ్యక్తిత్వం గలవారిని రెచ్చగొట్టే సామర్థ్యం వీరికి వుంది. ఇంకా వీరు ప్రజాదరణ కోసం, తమ కథనాలను ముందుకు తీసుకెళ్ళేందుకోసం అబద్ధాలను సృష్టించి, దృష్టి మళ్ళించడం ద్వారా నిజాలను ధిక్కరించే వరుస ప్రదర్శనలు చేశారు.

    Also Read : అదృష్టవంతులు.. రూ.1.8 కోట్ల విలువైన బంగారు ముద్దలు దొరికాయ్!

    అంతకన్నా ముందు జరిగిందేమంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన బాధ్యతల పంపిణీలో సమతుల్యత, హేతుబద్ధత, సమన్వయాలు లోపించాయి. కేంద్ర ప్రభుత్వాలు నిపుణుల శాస్త్రీయమైన సలహాలను పరిగణన లోకి తీసుకోకుండా హేతుబద్ధత లేని, తరచుగా మార్చే నియమాలను, విధానాలను రూపొందించాయి. రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు వైరస్‌ను నిరోధించడంలోనే కాక…ప్రజారోగ్యానికి మద్దతు ఇవ్వడం, మహమ్మారి కారణంగా పడిపోయిన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో కూడా తమ వంతుగా చాలా భారాన్ని మోస్తూ వస్తున్నాయి. వాటి మధ్య సమన్వయానికి కేంద్ర ప్రభుత్వాలు ఏమీ చేయలేదు. పైనుండి సమర్థవంతమైన మార్గదర్శకాలు లేకపోవడం కన్నా కూడా, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు తగినన్ని వనరులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయబద్ధంగా చెల్లించవలసిన నిధులను కూడా కేంద్రం ఇవ్వడానికి నిరాకరించిన భారతదేశంలో ఆర్థిక అసమతుల్యత ఎక్కువగానే ఉంది. ఇదే విధానం బ్రెజిల్‌, అమెరికా దేశాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మూడు దేశాల్లో ఏ ఒక్క దేశం కూడా మొత్తం ప్రజారోగ్యం పైన చేయాల్సిన ఖర్చును పెంచలేదు. ఒకవైపు ప్రభుత్వాలు దెబ్బ తిన్న కంపెనీలకు ఆర్థిక మద్దతు ఇవ్వజూపితే, ప్రయోజనాలు పొందింది మాత్రం పెద్ద కార్పొరేట్‌ సంస్థలు. మరోవైపు పేదలు మాత్రం ముఖ్యంగా భారత దేశంలో అత్యంత తక్కువ సహాయాన్ని పొందారు.

    ప్రాణాలకు తెగించి ఆరోగ్య సేవలు అందించడం, ఆహార ధాన్యాలను సరఫరా చేయడం లాంటి సమాజ అవసరాలను తీర్చే కార్మికులు సైతం చాలా తక్కువ మద్దతు, రక్షణ పొందారు. అనేక మంది కార్మికులకు చాలినంత వేతనాలు, సరిపడా సంరక్షణ పరికరాలు, కనీసం మహమ్మారి వ్యాప్తి కాలంలోనైనా ఆరోగ్య బీమా సౌకర్యాలు సమకూర్చలేదు. అయినా ప్రమాదకరమైన ఈ వైఫల్యాలను చక్కదిద్దడానికి బదులుగా, ట్రంప్‌, బోల్సనారో, మోడీలు దష్టి మళ్ళించే చర్యలకు పాల్పడుతున్నారు. ట్రంప్‌ సమర్థవంతంగా ప్రతిస్పందించకుండా, చైనా తప్పుడు సమాచారం ఇస్తుందన్న నెపంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి విరమించుకుంటున్నట్లు, చైనాపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాడు. భారత దేశంలో మోడీ ప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా హిందూ జాతీయవాద ప్రేరేపిత చర్యలతో ముస్లింలను బలిపశువులను చేస్తోంది.

    Also Read : అమెరికా ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలుస్తారా?

    ఈ మూడు దేశాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తి కంటే ముందు నుంచే, ఆధిపత్య సమూహాల భౌతిక దాడులను ప్రోత్సహించడం, సామాజిక విభజనను మరింతగా వేగవంతం చేయడం చూస్తున్నాం. బోల్సనారో కు జాత్యహంకారిగా, స్త్రీ ద్వేషిగా, మైనారిటీల హక్కులను బలహీన పరిచిన చరిత్ర ఉంది. శ్వేతజాతి ఆధిపత్యవాదాన్ని విస్తరించడం, నల్ల జాతికి జరుగుతున్న అన్యాయానికి, పోలీసుల అనాగరిక చర్యలకు వ్యతిరేకంగా ఇప్పుడు జరుగుతున్న నిరసనల ఖండనలను ట్రంప్‌ విభజన చరిత్రకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఈ ముగ్గురు నాయకులు కూడా… భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసేవారిని అణచడానికి వైరస్‌ మహమ్మారిని ఒక సాకుగా ఉపయోగించుకున్నారు.

    శాంతియుతంగా నిరసన తెలిపే వారి నోరు మూయించడానికి కేంద్ర బలగాలను (తరచుగా మామూలు దుస్తుల్లో) ఉపయోగించినందుకు ట్రంప్‌ చర్యలను ప్రజలు బహిరంగంగానే నిరసించారు. కానీ భారతదేశంలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. శాంతియుతంగా నిరసనలలో పాల్గొన్న ప్రజలను నిర్భందిస్తున్నారు. కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న భారతదేశం లోని జైళ్ళు ఇప్పుడు అనేక మంది మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో నిండి వున్నాయి.

    అనాగరిక బలప్రయోగం కోవిడ్‌ వైరస్‌ ను నిలువరించలేదు. అదేవిధంగా మోసం, తారుమారు చేసే విధానం, బెదిరింపులు కూడా వైరస్‌ ను అడ్డుకోలేవు. ప్రజల భాగస్వామ్యం, సహకారం, సామాజిక సంఘీభావం మాత్రమే కోవిడ్‌-19 ను ఓడించే ఏకైక మార్గమని ఇతర దేశాలు మనకు రుజువు చేసి చూపాయి. కోవిడ్‌-19 వలన నష్టపోయిన ప్రపంచంలోని పెద్ద దేశాలు ఒక భిన్నమైన మార్గాన్ని అనుసరించడం వల్ల ఎలాంటి ప్రమాదం వుండదు.

    Also Read : కరోనా వ్యాక్సిన్ కి ఫిక్సయిన రేట్?