YS Vivekananda Reddy: వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి మూడున్నరేళ్లు గడుస్తోంది. సరిగ్గా 2019 ఎన్నికల హడావుడిలో ఉండగా మార్చిలో వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఆయన నాటి ప్రతిపక్ష నేత జగన్ కు స్వయాన బాబాయ్. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు. దీంతో అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారే ఈ ఘాతుకానికి పాల్పడిందంటూ జగన్ అండ్ కో ఊరూవాడా ప్రచారం చేశారు. అంతటితో ఆగకుండా జగన్ మీడియా నారాసుర రక్త చరిత్ర అంటూ పతాక శీర్షికన కథనాలు వండి వార్చింది. దీంతో చంద్రబాబుకు ఎన్నికల్లో చాలా నష్టం జరిగింది. సానుభూతి పనిచేసి జగన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే అక్కడే సీన్ మారింది. అప్పటివరకూ సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేసిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ అవసరం లేదని తేల్చేశారు. నెలలు, ఏళ్లు గడుస్తున్నా వివేకానందరెడ్డి హత్య కేసులో ఎటువంటి పురోగతి లేదు. దీంతో వివేకా కుమార్తె రంగంలోకి దిగారు. ఆమె ఒత్తడి మేరకు చివరకు జగన్ సీబీఐ దర్యాప్తునకు ఒప్పుకోక తప్పలేదు. అయితే సీబీఐ కు అప్పగించినా కేసు దర్యాప్తు మాత్రం స్లోగా సాగుతోంది. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులపై కొందరు అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు దిగారు. దీనిపై సదరు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీనిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అసలు దర్యాప్తును పూర్తిచేసే ఉద్దేశ్యం అసలు ఉందా అన్న ప్రశ్న అయితే ఉత్పన్నమవుతోంది. అయితే ఈ విషయంలో బీజేపీ అదును కోసం వేచిచూస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
మాస్టర్ ప్లాన్…
దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలన్న కృతనిశ్చయంతో బీజేపీ పెద్దలు పనిచేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. వచ్చే ఎన్నికలే టార్గెట్ గా నిర్ణయించుకొని ముందుకు సాగుతున్నారు. పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ లో నుంచి కీలక నాయకులను చేర్చుకునే పనిలో ఉన్నారు. అదే సమయంలో ఆంధ్రా సెటిలర్ష్ ఓట్లపై కూడా ఫోక్ పెట్టారు. అయితే తెలంగాణతో పోల్చుకుంటే బీజేపీ ఆంధ్రాలో ఉనికి చాటుకోలేకపోతోంది. బలపడాలని ప్రయత్నిస్తున్నా వీలుపడడం లేదు. వరుస ఉప ఎన్నికల్లో ఓటమి పాలవుతోంది. పేరుమోసిన నాయకులు ఉన్నా పార్టీ ప్రజల్లోకి చొచ్చుకెళ్లలేకపోతోంది. అందుకే బీజేపీ పెద్దలు ఏపీపై ఆశలు వదులుకున్నారు. కానీ తెలుగుదేశం, జనసేన రూపంలో ఒకవైపు… వైసీపీ రూపంలో మరోవైపు ఆప్షన్ ఉంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగినా ఫలితం ఉండదు. అందుకే ఏదో కూటమితోనే వెళితేనే ఫలితముంటుందని బీజేపీ పెద్దలకు తెలుసు. అటువంటి సమయంలో ఎక్కువ స్థానాలు పొంది ఏపీలో పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. వైసీపీకి కేసుల భయం చూపి దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును బూచీగా చూపుతోందన్న టాక్ నడుస్తోంది. సీబీఐ దర్యాప్తు నత్తనడకన సాగడానికి అదే కారణంగా విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికల ముందు వైసీపీ తోక జాడిస్తే కేసును వేగవంతం చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట.
Also Read: KTR WhatsApp Account Blocked: షాక్ లగా..ఏకంగా ఐటీ మంత్రి కేటీఆర్ వాట్సాప్ అకౌంట్ బ్లాక్..
ఎన్నికల సమయానికి…
అయితే అదే సమయంలో టీడీపీ, జనసేన స్నేహ హస్తాన్ని వదులకోకూడదని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే సరికొత్త యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ముఖ్యంగా చంద్రబాబును తెలంగాణ అవసరాలకు వాడుకోవడానికి యోచిస్తున్నారు. తెలంగాణలో 40 నియోజకవర్గాల్లో సెటలర్స్ అధికం. వారంతా దాదాపు టీడీపీ అభిమానులుగా ఉంటారు. వారి ఓట్లే కీలకం. గెలుపోటములను నిర్దేశించగలరు. దీనిని గుర్తించిన కేసీఆర్ ఎన్నడూ లేనివిధంగా ఎన్డీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. దీని వెనుక వ్యూహం సెటిలర్స్ ఓట్ల కోసమేనని బీజేపీ పెద్దలు గుర్తించారు. అందుకే చంద్రబాబు అవసరాన్ని గుర్తించారు వచ్చే ఎన్నికల్లో గెలవాలన్న భావనతో ఉన్న బీజేపీ ఏపీలో టీడీపీకి స్నేహ హస్తం అందించి తెలంగాణలో లాభపడాలని ప్రయత్నిస్తోంది. అయితే అదే సమయంలో చంద్రబాబు కూడా బీజేపీ పెద్దలకు వర్తమానం పంపినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక ఎన్నికల సమయంలో దర్యాప్తు పూర్తిచేసి నిందితుల పేర్లు వెల్లడిస్తే వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందని బాబు భావిస్తున్నారు. సీబీఐ దర్యాప్తు మందగించడానికి ఇది కూడా ఒక కారణంగా తెలుస్తోంది.
Also Read: Film Shooting Is Closed: సినిమా షూటింగ్ ల బంద్..: ఎవరికి నష్టం..?