Visakha Capital Issue: ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట రాజధాని విషయంలో మరోమారు మరో ఉద్యమం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎం జగన్ సమస్యను పరిష్కరించకుండా దాన్ని పెంచేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మూడు రాజధానుల బిల్లు రద్దు చేసినా మళ్లీ రాజధాని విషయంలో పీటముడి వేస్తూ మాట్లాడటంతో ప్రజల్లో కూడా ఆందోళన నెలకొంది. విశాఖను రాజధానిగా చేయాలని డిమాండ్ తాజాగా తెరమీదకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఉద్యమం చేపట్టాలని ప్రజలు భావిస్తున్నట్లు సమాచారం.
పరిపాలనా వికేంద్రీకరణ కోసం మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చినా అది ఆచరణ సాధ్యం కాదని తెలియడంతో దాన్ని రద్దు చేసినా రాజధాని విషయంలో మాత్రం ఓ అవగాహనకు రావడం లేదు. దీంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలతో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును రద్దు చేసినా కొత్త రాజధాని ఏదనే దానిపై స్పష్టత ఇవ్వడం లేదు.
దీంతో రాజధాని విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో మళ్లీ ఆందోళన కలుగుతోంది. అమరావతికి బదులు విశాఖపట్నంను చేస్తారేమోననే సందేహాలు అందరిలో వస్తున్నాయి. దీంతో ప్రజల్లో కూడా రాజధాని విషయంపై మళ్లీ కథ మొదటికొచ్చినట్లు తెలుస్తోంది. విశాఖను రాజధానిగా చేయాలని విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతన్నట్లు సమాచారం.
Also Read: Janasena: ప్రకృతి వైపరీత్యం కాదు.. ప్రభుత్వ వైఫల్యమే! వరద బాధితుల వద్దకు పవన్
రాజధాని వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అమరావతిని రాజధానిగా చేసే క్రమంలో చంద్రబాబు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నిధులు ఖర్చు చేసి తీర్చిదిద్దినా జగన్ నిర్ణయంతో అవన్ని వృథాగా పోయే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల వ్యవహారం మరో మలుపు తిరుగుతుందని తెలుస్తోంది. ఇందుకోసం జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారోననే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి.
Also Read: AP 3 Capitals: తగ్గేదేలే! జస్ట్ గ్యాప్ ఇచ్చాడంతే.. ఏపీ రాజధానిపై జగన్ సంచలనం