https://oktelugu.com/

Nithin: వెబ్​సిరీస్​వైపు నితిన్​ అడుగులు.. ఎలాంటి కథతో వస్తున్నారంటే?

Nithin: కరోనా మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుంచి థియేటర్లలో కల పోయింది. ఈ క్రమంలోనే ఓటీటీ హవా పుట్టుకొచ్చింది. ప్రస్తుతం ప్రేక్షకులు కూడా వాటివైపే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే సరికొత్త సినిమాలు, వెబ్​సిరీస్​, టాక్ షోలు ఇలా అన్నీ డిజిటల్​ ప్లాట్​ఫామ్​వైపే అడుగులేస్తున్నాయి. నటీనటులు కూడా ఓ వైపు సినిమాలు చేస్తూనే.. వెబ్​సిరీస్​లకూ ఓటేస్తున్నారు. ఇప్పటికే, నయనతార, సమంత, తమన్నా.. వెబ్​సిరీస్​ల్లో నటించి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు. కాగా, ఇప్పుడు మరో టాలీవుడ్​ హీరో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 23, 2021 / 10:53 AM IST
    Follow us on

    Nithin: కరోనా మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుంచి థియేటర్లలో కల పోయింది. ఈ క్రమంలోనే ఓటీటీ హవా పుట్టుకొచ్చింది. ప్రస్తుతం ప్రేక్షకులు కూడా వాటివైపే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే సరికొత్త సినిమాలు, వెబ్​సిరీస్​, టాక్ షోలు ఇలా అన్నీ డిజిటల్​ ప్లాట్​ఫామ్​వైపే అడుగులేస్తున్నాయి. నటీనటులు కూడా ఓ వైపు సినిమాలు చేస్తూనే.. వెబ్​సిరీస్​లకూ ఓటేస్తున్నారు. ఇప్పటికే, నయనతార, సమంత, తమన్నా.. వెబ్​సిరీస్​ల్లో నటించి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు. కాగా, ఇప్పుడు మరో టాలీవుడ్​ హీరో ఓటీటీ వైపు అడుగులేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.

    భాషతో సంబంధం లేకుండా ప్రస్తుతం వెబ్​సిరీస్​లు దుసుకెళ్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే నితిన్​ ఓటీటీ వేదికగా సినిమా కానీ, వెబ్​సిరీస్​ కానీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్​ వరుస ప్రాజెక్టులతో ఫుల్​ బిజీగా ఉన్నారు. మ్యాస్ట్రో సినిమాతో ఇటీవలే హాట్​స్టార్​లో పలకరించిన నితిన్​.. మంచి హిట్​ అందుకున్నారు. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమా షూటింగ్​లో ఉన్నారు నితిన్​. ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి  ఈ సినిమాకు దర్శకుడిగా పని చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్​ 29న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్​ సినిమాపై బారీగా అంచనాలు రేకెత్తిస్తోంది.

    Also Read: Acharya: ‘ఆచార్య’ నుంచి మరో ఇంట్రస్టింగ్ అప్​డేట్​కు రెడీగా ఉన్నారా?

    దీంతో పాటు, ఓటీటీకోసం ఏదైనా మంచి కథతో సినిమా కానీ, వెబ్​సిరీస్​ కానీ తీయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకోసం పలువురు రచయితలతో స్క్రిప్ట్ పనిలో పడినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్​.

    Also Read: Naga Chaitanya: జోష్ టూ లవ్ స్టోరీ.. బర్త్ డే బాయ్ నాగచైతన్య కెరీర్ లో బెస్ట్ చిత్రాలు ఇవే!