https://oktelugu.com/

సీఎంపై ఫైరవుతున్న రాములమ్మ.. త్వరలోనే ప్రెస్ మీట్?

లేడి అమితాబ్, కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఇటీవలీ కాలంలో తెలంగాణ ప్రజా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి సీఎం కేసీఆర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని రాములమ్మ ఆరోపించారు. ఇక హైదరాబాద్ మహానగరం చిన్నపాటి వానకే జలమయం అవుతున్నా సీఎం కేసీఆర్ కాపాడలేకపోయారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం వల్లే నేడు వరంగల్ నగరం కూడా హైదరాబాద్ నగరంలా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 19, 2020 / 07:49 PM IST
    Follow us on


    లేడి అమితాబ్, కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఇటీవలీ కాలంలో తెలంగాణ ప్రజా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి సీఎం కేసీఆర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని రాములమ్మ ఆరోపించారు. ఇక హైదరాబాద్ మహానగరం చిన్నపాటి వానకే జలమయం అవుతున్నా సీఎం కేసీఆర్ కాపాడలేకపోయారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం వల్లే నేడు వరంగల్ నగరం కూడా హైదరాబాద్ నగరంలా జలమయం అయిందన్నారు.

    Also Read: గల్లా పయనం కమలం వైపేనా?

    ప్రభుత్వ అండదండలతో కొందరు వరంగల్ నగరంలో భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చెరువులు, నాలాలను కూడా అక్రమార్కులు వదలడం లేదన్నారు. పెరుగుతున్న జనాభాకనుగుణంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయలేకపోయిందన్నారు. ఇప్పటికే నగరంలో సరైన డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించలేదన్నారు. ఎన్నడూ లేని విధంగా వరంగల్ నగరం నీటమునగడానికి అక్రమార్కుల భూకబ్జాలు, ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ ఘోరంగా విఫలమైందన్నారు. భూకబ్జా ల విషయంలో ఇటీవల రెవెన్యూ వ్యవస్థ ఎంత దారుణంగా పనిచేస్తుందో కోటి రూపాయల లంచం ఘటన తెలియజేస్తుందని విజయశాంతి ఎండగట్టారు.

    రాష్ట్రంలో కరోనా కట్టడిలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తొలినాళ్లలో కరోనా టెస్టులు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోయిందన్నారు. ఒకప్పుడు జీహెచ్ఎంసీకే పరిమితమైన కరోనా కేసులు నేడు పల్లెలకు విస్తరించడం టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యానికి నిదర్శనమన్నారు. తెలంగాణలో కరోనా హాస్పిటల్ గా పేరొందిన గాంధీ ఆస్పత్రి ఇటీవల పలుమార్లు అగ్నిప్రమాదానికి గురైన ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన మౌలిక సదుపాయాలు కూడా లేవని దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగిన వైద్య సిబ్బందిలేక రోగులకు సరైన వైద్యం అందడం లేదన్నారు.

    Also Read: సోము వీర్రాజు పై జగన్ విసరనున్న అస్త్రం ఇతనే..?

    ఇక ప్రైవేట్ ఆస్పత్రుల్లో సామాన్యులు చికిత్స చేయించుకోలేకపోతున్నారని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో యాజమాన్యాలు కరోనా రోగులకు లక్షల్లో బిల్లులు వేస్తున్నా ప్రభుత్వం వాటిని కట్టడి చేయలేకపోతుందన్నారు. ఇక త్వరలోనే హైదరాబాద్ నడిబొడ్డులో ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టేలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. హైదరాబాదులో కరోనా కట్టడి ప్రభుత్వ నిర్లక్ష్యం.. రోడ్లు జలమయం విషయంలో ప్రభుత్వం ఎలా వైఫల్యం చెందిందో ప్రజలకు రాములమ్మతో చెప్పేందుకు టీకాంగ్రెస్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రాములమ్మ హైదరాబాద్ నడిబొడ్డున ప్రెస్ మీట్ పెట్టి సీఎం కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టడం ఖాయమని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.